John Abraham: అంబానీ ఇంట్లో ఎంగేజ్‌మెంట్‌.. నీకే డ్రెస్సూ దొరకలేదా? నటుడిపై విమర్శలు

Anant Ambani Radhika Merchant Engagement: John Abraham Trolled For His Outfit - Sakshi

రిలయస్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ- రాధిక మర్చంట్‌ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ముంబైలో గురువారం జరిగిన వీరి ఎంగేజ్‌మెంట్‌కు బాలీవుడ్‌ నుంచి సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, సారా అలీ ఖాన్‌, వరుణ్‌ ధావన్‌, మనీష్‌ మల్హోత్రా, అర్జున్‌ కపూర్‌, బోనీ కపూర్‌, ఐశ్వర్య రాయ్‌, ఆరాధ్య, కత్రినా కైఫ్‌, రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, జాన్వీ, ఖుషి కపూర్‌, అనన్య పాండే సహా తదితరులు హాజరయ్యారు. 

దాదాపు అందరూ సాంప్రదాయ దుస్తుల్లోనే వేడుకలో పాల్గొన్నారు. కానీ నటుడు జాన్‌ అబ్రహం మాత్రం జీన్స్‌, టీ షర్ట్‌ అండ్‌ బ్లాక్‌ బేజర్‌ ధరించి ఫంక్షన్‌కు వెళ్లాడు. అంత క్యాజువల్‌గా ఫంక్షన్‌కు వెళ్లడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'భారతీయ సాంప్రదాయ వేడుకలకు ఎలా రెడీ అవ్వాలో తెలియదా? ఏదైనా ట్రెడిషనల్‌ డ్రెస్‌ సెలక్ట్‌ చేసుకోవాల్సింది, అయినా నీకే డ్రెస్సూ దొరకలేదా? మరీ జీన్స్‌లో వెళ్తావా?' అని క్లాస్‌ పీకుతున్నారు. 'అంబానీ ఫంక్షన్‌కు అంత సింపుల్‌గా వెళ్లిపోయావంటే నమ్మబుద్ధి కావట్లేదు, కాస్త మంచి డ్రెస్‌ వేసుకోవాల్సింది' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా జాన్‌ అబ్రహం పఠాన్‌ సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ సినిమా జనవరి 25న రిలీజ్‌ కానుంది.

చదవండి: బంగారు బహుమతులిచ్చిన కీర్తి సురేశ్‌!
భర్త ఎఫైర్లు భరించలేక విడాకులు కోరుతున్న నిర్మాత భార్య

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top