Kamaal R Khan: నిర్మాత ఎఫైర్లు.. భరించలేక విడాకులు కోరుతున్న భార్య!

Kamaal R Khan: Top Bollywood Producer Wife Asking Divorce - Sakshi

బాలీవుడ్‌ క్రిటిక్‌ కమల్‌ ఆర్‌ ఖాన్‌(కేఆర్‌కే) సెలబ్రిటీలను, వారి సినిమాలను విమర్శించడమే పనిగా పెట్టుకుంటాడు. స్టార్‌ హీరోల సినిమా రిలీజవుతుందంటే చాలు ముందుగానే ఫ్లాప్‌, డిజాస్టర్‌ అంటూ ప్రచారం చేస్తాడు. సినీప్రముఖుల వ్యక్తిగత విషయాలను కూడా సోషల్‌ మీడియాలో బయటపెడుతూ విమర్శలు గుప్పిస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన ట్వీట్‌ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 

'బ్రేకింగ్.. ఓ బడా నిర్మాత భార్య ఇల్లు వదిలి బయటకు వచ్చేసింది. ప్రస్తుతం హోటల్‌లో ఉంటోంది. తన భర్త చాలామందితో అఫైర్లు పెట్టుకున్నాడన్న కోపంతో అతడికి ఏకంగా విడాకులు ఇచ్చేందుకు రెడీ అయింది' అని రాసుకొచ్చాడు. అయితే ఆ నిర్మాత ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ ట్వీట్‌పై కొందరు నెటిజన్లు గరమవుతున్నారు.వారి వ్యక్తిగత విషయాల్లోకి తొంగి చూడటం అవసరమా? అని క్లాస్‌ పీకుతున్నారు. మరికొందరు మాత్రం అది ఎవరై ఉంటారా? అని ఆలోచనలో పడ్డారు. నెటిజన్ల రియాక్షన్స్‌ కింది ట్వీట్స్‌లో చూడండి.

చదవండి: ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మంచు మనోజ్‌
కొత్త ఇల్లు కొన్న త్రిష.. ఎన్ని కోట్లో తెలుసా?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top