'My Face got Paralyzed' - Emotional interview of Adithya Menon
Sakshi News home page

Adithya Menon: ముఖానికి పక్షవాతం, నటుడిగా చాలా భయపడిపోయా..

Nov 12 2022 4:59 PM | Updated on Nov 12 2022 5:35 PM

Adithya Menon: My Face got Paralyzed - Sakshi

చాలా కష్టపడి స్టంట్‌ సీన్స్‌ చేశాను. తర్వాత పెద్ద నటుడు వచ్చి వీడికి ఇంత పెద్ద సీన్లు అవసరమా? అక్కర్లేదు, కొన్ని సన్నివేశాలు కట్‌ చెయ్‌ అని చెప్పాడు. అలా నేను కష్టపడ్డ చాలా షాట్స్‌ తీసేశారు. అప్పుడు చాలా ఫీలయ్యా. కానీ తర్వాత అర్థమైంది. సినిమా అంటేనే గేమ్‌ అని!  స్క్రీన్‌పై వచ్చేదాకా మనం ఎక్కడున్నామనేది

సహాయ నటుడిగా, విలన్‌గా మెప్పిస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు నటుడు ఆదిత్య మీనన్‌. బిల్లాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన సింహా సినిమాతో బ్రేక్‌ అందుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌ గురించి కూడా మాట్లాడాడు. '2006లో నాకు బెల్స్‌ పాల్సీ అటాక్‌ అయింది. దీనివల్ల నా ముఖంలో సగభాగం పక్షవాతానికి గురైంది. ఎక్కువ ఒత్తిడి వల్ల అది వచ్చినట్లుంది. కానీ ఒక నటుడిగా చాలా భయమైంది. ఫిజియోథెరపీ చేయించుకున్నా, చికిత్స తీసుకున్నా. ఒక నెలలో తిరిగి మామూలైపోయాను.

ఒక సంఘటన నాకింకా గుర్తుంది. ఓ మలయాళ సినిమా కోసం చాలా కష్టపడి స్టంట్‌ సీన్స్‌ చేశాను. తర్వాత సినిమాకు సంబంధించిన పెద్ద నటుడు వచ్చి ఇతనికి ఇంత పెద్ద సీన్లు అవసరమా? అక్కర్లేదు, కొన్ని సన్నివేశాలు కట్‌ చెయ్‌ అని చెప్పాడు. అలా నేను కష్టపడ్డ చాలా షాట్స్‌ తీసేశారు. అప్పుడు చాలా ఫీలయ్యా. కానీ తర్వాత అర్థమైంది. సినిమా అంటేనే గేమ్‌ అని!  స్క్రీన్‌పై వచ్చేదాకా మనం ఎక్కడున్నామనేది ఎవరికీ తెలియదు. ప్రస్తుతం సర్వ సాధారణంగా జరుగుతున్న విషయమిది. ఇప్పుడు నా సన్నివేశాలు తగ్గించినా అంతగా బాధపడను' అని చెప్పుకొచ్చాడు ఆదిత్య మీనన్‌.

చదవండి: ప్రభాస్‌ సినిమాలో రామ్‌గోపాల్‌ వర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement