Adipurush Movie Actor Lavi Pajni Reacts On Dialogues Controversy, Says He Is Hurt With Dialogues - Sakshi
Sakshi News home page

Adipurush Dialogues Controversy: మా సినిమాలోని డైలాగ్స్‌ నన్నెంతో బాధపెట్టాయి.. ఆదిపురుష్‌ నటుడు

Jun 28 2023 8:54 PM | Updated on Jun 29 2023 12:15 PM

Adipurush Movie Actor Lavi Pajni Says He is Hurt with Dialogues of Prabhas Film - Sakshi

మనం డైరెక్టర్‌ ఏది చెప్తే అది చేయాల్సి ఉంటుంది. సినిమాను కొద్దికొద్ది భాగాలుగా చిత్రీకరిస్తూ పోయారు. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. సినిమాలో

ఓం రౌత్‌ తెరకెక్కించిన ఆదిపురుష్‌కు ఆది నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా హనుమంతుడి నోట వచ్చే మాస్‌ డైలాగులపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది. ఈ డైలాగులు జనాలకు కనెక్ట్‌ అవుతాయనుకుంటే రివర్స్‌ అయిందేంటని నాలుక్కరుచుకున్న చిత్రయూనిట్‌ వెంటనే తప్పును సరిదిద్దుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ డైలాగులు కూడా సినిమాపై నెగెటివిటీ పెరిగేందుకు దోహదపడ్డాయి.

అయితే ఆ డైలాగులు తనకు కూడా నచ్చలేదంటున్నాడు ఆదిపురుష్‌ నటుడు లావ్‌ పజ్నీ. సినిమాలో కుంభకర్ణుడిగా నటించిన అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'మనం డైరెక్టర్‌ ఏది చెప్తే అది చేయాల్సి ఉంటుంది. సినిమాను కొద్దికొద్ది భాగాలుగా చిత్రీకరిస్తూ పోయారు. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. సినిమాలోని వివాదాస్పద సంభాషణలు తొలగించినప్పటికీ.. ఒక హిందువుగా ఆ డైలాగులు విని నేను కూడా ఆవేదన చెందాను' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: పెళ్లికి ముందే ప్రియుడి ఇంటికి నటి.. వేణుమాధవ్‌తో రిలేషన్‌ ఏంటంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement