కొండచిలువను పెంచుకుంటున్న హీరోయిన్‌! | Sakshi
Sakshi News home page

Sushmita Sen: కొండచిలువను పెంచుకుంటున్న స్టార్‌ హీరోయిన్‌!

Published Sun, Feb 4 2024 10:49 AM

Actress Sushmita Sen Owns A Pet Python At Her House, News Goes Viral - Sakshi

కొండచిలువను ముట్టుకునేంత..కాదు కాదు దగ్గర నుంచి చూసేంత ధైర్యం ఉందా? భలేవాడివి బాసూ.. అదేమైనా కుక్క పిల్లా? లేదా పిల్లి పిల్లనా? ముట్టుకొని ముద్దాడడానికి? అంటారా? మీకే కాదు సహజంగా ఎవరికైనా పాములను చూడగానే భయం వేస్తుంది. ఎక్కడో దూరాన ఉన్న చిన్న పామును చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం. అలాంటిది కొండచిలువలాంటి పాము మన దగ్గరకు వస్తే.. ఊహించుకుంటేనే భయం వేస్తోంది కదా? కానీ ఓ హీరోయిన్‌ మాత్రం కొండ చిలువను కుక్కపిల్ల మాదిరి ముద్దుగా పెంచుకుంటుందట. దాన్ని పట్టుకొని ముద్దులు కూడా పెడుతుందట. 

పాములంటే ఇష్టం
సాధారణంగా సెలబ్రిటీలు కుక్కపిల్లల్ని.. ఇంకా ముద్దొస్తే  పిల్లి పిల్లల్ని పెంచుకోవడం గురించి వినే ఉంటారు! కానీ అలా ముచ్చటపడి పాములను పెంచుకోవడం గురించి విన్నారా? బాలీవుడ్‌ హీరోయిన్‌ సుష్మితా సేన్‌కి ఆ సరదా ఉందట. ఆమెకు పాములంటే పిచ్చి ఇష్టమట. ఆ ఇష్టంతోనే ఒక బుజ్జి కొండచిలువను పెంచుకుంటోందని బాలీవుడ్‌లో టాక్‌. ఖాలీ సమయం దొరికితే ఆ కొండ చిలువతో సరదాగా ఆడుకుంటుందట. అయితే తన కొండ చిలువకు సంబంధించిన విషయాలను సుష్మిత ఎక్కడా చెప్పలేదు కానీ..ఆమె సన్నిహితుల ద్వారా మీడియాకు ఈ విషయం లీకైంది. దీన్ని సుష్మిత ఖండించకపోవడంతో బాలీవుడ్‌ జనాలు ఇది నిజమనే నమ్ముతున్నారు. 

వెబ్‌ సిరీస్‌లతో బీజీ బీజీ..
1997లో రత్సగన్ అనే తమిళ్ సినిమాతో తెరంగేట్రం చేసింది సుస్మితా. మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలోని అగ్రకథానాయకులతో నటించింది. ముఖ్యంగా ఒకేఒక్కడు సినిమాలోని షకలకా బేబీ పాటతో సౌత్ ఇండస్ట్రీలోనే ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ రాణించింది. ప్రస్తుతం పలు చిత్రాలతో పాటు వెబ్‌ సిరీస్‌ చేస్తూ కెరీర్‌ పరంగా ఇప్పటికీ బీజీగా ఉన్నారు. ఆ మధ్య  ఆర్య -3 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చి, తనదైన నటనతో ఆకట్టుకుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement