Actress Sree Leela Movie Mania For Next 6 Months - Sakshi
Sakshi News home page

Sreeleela: సెన్సేషనల్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్లనే మించిపోయేలా!

Aug 2 2023 8:56 AM | Updated on Aug 2 2023 10:51 AM

Actress Sreeleela Five Movies Release Next Six Months - Sakshi

యంగ్ సెన్సేషన్ శ్రీలీల నక్క తోక తొక్కింది. లేకపోతే ఏంటబ్బా.. తిప్పికొడితే పాతికేళ్లు లేవు. కానీ స్టార్ హీరోయిన్లకు చెమటలు పట్టిస్తోంది. ఎందుకంటే స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోస్ వరకు అందరి ఛాయిస్ ఈమెనే. అస్సలు ఖాళీ ఉండట్లేదు. ప్రస్తుతం ఈమె చేతిలో 10 వరకు సినిమాలున్నాయి. అలా బిజీబిజీగా ఉన్న ఈ బ్యూటీ.. వేరే ఏ హీరోయిన్‌కి సాధ్యం కానీ విధంగా రికార్డ్ సృష్టించింది.

తెలుగు మూలాలున్న శ్రీలీల అమెరికాలో పుట్టింది. మూడేళ్లకే డ్యాన్స్ నేర్చుకున్న ఈ బ్యూటీ.. కన్నడ సినిమాతో నటిగా మారింది. అక్కడ ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. 'పెళ్లి సందD'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్దగా ఆడలేదు కానీ శ్రీలీలకి అందరూ ఫిదా అయిపోయారు. దీని తర్వాత రవితేజ 'ధమాకా'లో క్యూట్ అండ్ స్వీట్ యాక్టింగ్‌తో అదరగొట్టేసింది. డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

(ఇదీ చదవండి: సమంత ట్రీట్‌మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?)

'ధమాకా' హిట్ దెబ్బకు శ్రీలీల పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది. అదే టైంలో చేతి నిండా అవకాశాలతో ఈ బ్యూటీ ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో పదివరకు సినిమాలు ఉన్నాయి. వీటిలో దాదాపు ఐదు చిత్రాలు.. వచ్చే ఆరు నెలల్లో థియేటర్లలోకి రానున్నాయి. మెగాహీరో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' ఆగస్టు 18న, రామ్ 'స్కంద' సెప్టెంబరు 18న, బాలకృష్ణ 'భగవంత్ కేసరి' అక్టోబరు 19న, నితిన్ 'ఎక్స్ ట్రా' డిసెంబరు 23న, మహేశ్ 'గుంటూరు కారం' జనవరి 13న థియేటర్లలోకి రానున్నాయి.

గతంలో ఓ హీరోయిన్ నటించిన రెండు మూడు చిత్రాలు వరస నెలల్లో విడుదలయ్యాయి. కానీ ఇలా ఐదు సినిమాలు, అది కూడా ఇంత తక్కువ టైంలో రావడం మాత్రం బహుశా ఇదే తొలిసారి అనిపిస్తుంది. ఇవే కాకుండా పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', నవీన్ పోలిశెట్టి 'అనగనగ ఒక రాజు'తో పాటు మరిన్న చిత్రాలు లైనప్‌లో ఉన్నాయి. వీటిలో ఏ కొన్ని హిట్ అయినాసరే శ్రీలీల.. ఎక్కడికో వెళ్లిపోవడం గ్యారంటీ.

(ఇదీ చదవండి: హీరో విశ్వక్ సేన్‌తో గొడవపై 'బేబీ' డైరెక్టర్ క్లారిటీ!)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement