Actress Sneha Sharma Sensational Comments On Casting Couch In Tollywood - Sakshi
Sakshi News home page

Sneha Sharma On Casting Couch: 'అడుక్కుతిని అయినా బతుకుతా కానీ అలాంటివి చేయను'..

Feb 25 2022 3:23 PM | Updated on Feb 25 2022 3:56 PM

Actress Sneha Sharma Open Up On Casting Couch - Sakshi

Actress Sneha Sharma Open Up On Casting Couch: సినీ ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. పైకి ఎంతో అందంగా కనపడినా బయటకి కనిపించని మరకలు ఎన్నో ఉంటాయి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ కల్చర్ గురించి ఇప్పటికే చాలామంది నటీమణులు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఒకవిధంగా సినీ పరిశ్రమలో ఈ లైంగిక వేధింపులపై మీటూ ఉద్యమం కూడా పుట్టుకొచ్చింది. స్టార్ హీరోయిన్స్ నుండి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదిగే హీరోయిన్స్ వరకు ఎంతో మంది వారి వారి అనుభవాలను చెప్పుకున్నారు.

తాజాగా నా ప్రేమ నాకు కావాలి ఇండిపెండెంట్‌ మూవీ హీరోయిన్‌ స్నేహా శర్మ తనకు ఎదురైన ఇబ్బందుల గురించి ఓపెన్‌ అప్‌ అయ్యింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో ఇలాంటివి నేను కూడా ఫేస్‌ చేశాను. కమిట్మెంట్‌ అడిగారు. నో చెప్పినందుకు సినిమాలోంచి తీసేశారు. అలా పెద్ద సినిమాల్లో కూడా అవకాశం కోల్పోయాను.

అయినప్పటికీ  అడుక్కు తిని అయినా బతుకుతా కానీ ఇలాంటి పనులు చేయను అని చెప్పేశాను. అయినా ఇక్కడ బలవంతాలు ఉండవు. మన మీద కూడా ఆధారపడి ఉంటుంది. అడిగేవాళ్లు అడుగుతారు. నిర్ణయం మాత్రం మనదే' అంటూ తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement