
Actress Sanam Shetty Shocking Comments on Bigg Boss: బిగ్‌బాస్ రియాలిటీ షోతో రాత్రికి రాత్రే పాపులారిటీ వస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని వాళ్లు సైతం బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లెకి వస్తారు. కానీ బిగ్‌బాస్ షో ముగిశాక మాత్రం ఆ ఎఫెక్ట్ అంతగా కనపడదు. ఈ షో వల్ల పెద్దగా ప్రయోజనం లేదని షో నుంచి బయటకు వచ్చిన చాలా మంది కంటెస్టెంట్లు చెప్పే మాట. తాజాగా హీరోయిన్, తమిళ బిగ్‌బాస్ సీజన్-4 ఫేమ్ సనమ్ శెట్టి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
బిగ్‌బాస్ షోలో పాల్గొనడం వల్ల తనకు సినిమా అవకాశాలు ఏం పెరగలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. షో అనంతరం వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం సనమ్ శెట్టి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక 25కి పైగా సినిమాల్లో నటించిన ఈమె తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొంది.