Actress Sadha Biography, Filmography - Sakshi
Sakshi News home page

Sadha: జీవితంలో కొందరిని తీసేయాలి, బలవంతంగా బంధంలో ఉండే కన్నా..

May 7 2023 3:23 PM | Updated on May 7 2023 3:35 PM

Actress Sadha Biography, Filmography - Sakshi

ఎన్టీఆర్‌తో ‘నాగ’ చిత్రంలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. అయితే, ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో ఆమె స్టార్‌ హీరోయిన్‌ అయ్యే ఛాన్స్‌ మిస్‌ అయింది. 

అదృష్టం బాలేకుంటే, అరటిపండు తిన్నా పళ్లు విరిగినట్లు.. అగ్రహీరోలతో నటించినా ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయింది నటి సదా. అందుకే, కాస్త సమయం తీసుకుని ఇప్పుడు వెబ్‌ సిరీస్‌లలో తన సత్తా చాటుతోంది. 

మహారాష్ట్రలోని రత్నగిరి సదా సొంతూరు. తండ్రి డాక్టర్,  తల్లి బ్యాంక్‌ ఉద్యోగి. రత్నగిరిలోని సేక్రెడ్‌ హార్ట్స్‌ కాన్వెంట్‌ హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి, ముంబై చేరింది. 

అక్కడ ఆమెను చూసిన తేజ తను రూపొందిస్తున్న ‘జయం’ లో అవకాశం ఇచ్చాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌తో ‘నాగ’ చిత్రంలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. అయితే, ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో ఆమె స్టార్‌ హీరోయిన్‌ అయ్యే ఛాన్స్‌ మిస్‌ అయింది. 

ఆ తర్వాత ‘దొంగ దొంగది’, ‘అపరిచితుడు’, ‘మోనాలిసా’, ‘లీలా మహల్‌ సెంటర్‌’, ‘ఔనన్నా కాదన్నా’, ‘చుక్కల్లో చంద్రుడు’, ‘వీర భద్ర’, ‘టక్కరి’ వంటి పలు చిత్రాల్లో  నటించినా అనుకున్న స్థాయికి ఎదగలేకపోయింది. దీంతో రూట్‌ మార్చి, బుల్లితెరపై మెరిసింది. 

పలు టీవీ షోల్లో జడ్జీగా వ్యవహరించి తెలుగువారికి మరింత దగ్గరైంది. వీటితోపాటు యూట్యూబ్‌ వేదికగా సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకుంటూ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. 

ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘హలో వరల్డ్‌’ సిరీస్‌లో పవర్‌ఫుల్‌ లేడీ బాస్‌గా కనిపిస్తోంది.

ఇంట్లో ఎలాగైతే అవసరం లేని వస్తువులను బయటపడేసి శుభ్రం చేసుకుంటామో, అలాగే మన జీవితాల్లోంచి కూడా కొందరిని తీసేసి మనల్ని మనం మెరుగుపరచుకోవాలి. జీవితం చాలా చిన్నది. బలవంతంగా బంధాల్లో ఉండటం కంటే ఒంటరిగా సంతోషంగా ఉండటం మంచిది
– సదా

చదవండి: మైనస్‌ 15 డిగ్రీల చలిలో హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement