Telugu Heroine, Actress Raima Sen's Unseen Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Guess The Actress: ఈమె తల్లి మాజీ ఎంపీ, చెల్లెలు ప్రముఖ నటి!

Jul 27 2023 1:53 PM | Updated on Jul 27 2023 2:01 PM

Actress Raima Sen Unseen Pics Telugu Heroine - Sakshi

తెలుగు సినిమాలు మీరు బాగా చూస్తారా? అయితే మీకో పజిల్. ఇప్పటివరకు ఎంతమంది హీరోయిన్లు టాలీవుడ్‌లోకి వచ్చారనేది తెలుసా? మీకే కాదు దాదాపు ఏ ఒక‍్కరికీ తెలిసుండదు. ఎందుకంటే ప్రతి ఏడాది పదుల సంఖ్యలో బ్యూటీస్ వస్తూనే ఉంటారు. తమ లక్ పరీక్షించుకుంటుంటారు. కాకపోతే రేసులో నిలబడి స్టార్స్ అయ్యేది మాత్రం చాలా తక్కువమంది.

(ఇదీ చదవండి: 'బ్రో' ఫ్యాన్స్ అందరికీ బ్యాడ్ న్యూస్!)

పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా అలానే తెలుగులో ఛాన్స్ దక్కించుకుంది. అది కూడా తేజ లాంటి దర్శకుడి చేతిలో పడింది. నితిన్ హీరోగా నటించిన 'ధైర్యం'లో హీరోయిన్‌గా చేసింది. కానీ బ్యాడ్ లక్. ఆ మూవీ హిట్ కాలేదు. ఈమెకు మరో ఛాన్స్ రాలేదు. ఈమె పేరే రైమా సేన్. హీరోయిన్ రీమా సేన్‌కి ఈమెకు ఏం సంబంధం లేదనిపిస్తుంది. పేర్లు ఒకేలా ఉండటం వల్ల అందరూ పొరబడుతుంటారు.

ప్రస్తుతం హిందీ, బెంగాలీ భాషల్లో సినిమాలు చేస్తున్న రైమా సేన్ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే.. ముంబయిలో పుట్టింది. అమ్మమ్మ సుచిత్రా సేన్ నటి. ఆ తర్వాత ఈమె తల్లి మూన్ మూన్ సేన్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2014-19 మధ్య ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించింది. రైమా సేన్ చెల్లెలు రియా సేన్ కూడా నటి. ఈమె కూడా బెంగాలీ, హిందీలో సినిమాలు చేస్తోంది. ఇదంతా పక్కనబెడితే రైమా వయసు ప్రస్తుతం 43 ఏళ్లు. కానీ లేటెస్ట్‌గా ఈమె పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే మాత్రం.. వయసు అబద్ధమేమో అనే డౌట్ వస్తుంది. మరెందుకు లేటు.. ఆ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement