Actress Pragathi Interesting Comments On Second Marraige Goes Viral, Deets Inside - Sakshi
Sakshi News home page

Actress Pragathi : రెండోపెళ్లిపై ఆసక్తికర కామెంట్స్‌ చేసిన నటి ప్రగతి

Jan 3 2023 12:58 PM | Updated on Jan 3 2023 3:19 PM

Actress Pragathi Reacts On Second Marraige Goes Viral - Sakshi

నటి ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అమ్మ, వదిన పాత్రలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక సినిమాల కంటే సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయిన ప్రగతి వర్కవుట్‌, డ్యాన్స్‌ వీడియోలతో నెట్టింట అలరిస్తుంటుంది.

తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండోపెళ్లిపై ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. సింగిల్‌ మథర్‌ కాబట్టి ఎప్పుడైనా మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందా అన్న ప్రశ్నకు ఆమె మాట్లాడుతూ.. ''పెళ్లి అనే పదంకన్నా కంప్యానియన్‌ అనేది చాలా ముఖ్యం.

చాలాసార్లు నాకు కూడా కంప్యానియన్‌ ఉంటే బాగుంటుందనిపిస్తుంది. కానీ మళ్లీ నా మెచ్యూరిటీ లెవల్‌కి మ్యాచ్‌ అయ్యేవారు దొరకాలి కదా అనిపిస్తుంటుంది.  కొన్ని విషయాల్లో ఇలాగే ఉండాలి అని చాలా కశ్చితంగా ఉంటాను.  ఒకవేళ 20ఏళ్ల వయసులో ఉంటే అడ్జస్ట్‌ అయ్యేదాన్నేమో. కానీ ఇప్పుడు చాలా కష్టం'' అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement