Mrunal Thakur To Pair Opposite Sivakarthikeyan In Murugadoss Movie - Sakshi
Sakshi News home page

Mrunal Thakur: స్టార్ కాంబో.. మృణాల్‌కి లక్కీ ఛాన్స్

Aug 7 2023 8:39 AM | Updated on Aug 7 2023 9:16 AM

Actress Mrunal Thakur In Sivakarthikeyan Murugadoss Movie - Sakshi

Mrunal Thakur First Tamil Movie: హీరో-హీరోయిన్-డైరెక్టర్.. ఎవరైనా సరే ఒక్క హిట్‌ ఒకే ఒక్క హిట్‌ చాలు. కెరీర్‌ సాలీడ్‌గా సెటిల్‌ అయిపోతుంది. ఆ తర‍్వాత ఎన్ని హిట్, ఫ్లాప్స్ వచ్చినా అవి ఆటుపోటు లాంటివే, కొన్నాళ్లకు సర్దుకుంటాయి. నటి మృణాల్‌ ఠాకూర్‌ జీవితం ఇంతే. మోడలింగ్‌ నుంచి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. పలు యాడ్స్‌లో నటించింది. అనంతరం సినిమాల్లోకి వచ్చింది. పలు మరాఠీ , హిందీ చిత్రాల్లో నటించినా రాని క్రేజ్‌ 'సీతరామం' అనే ఒక్క తెలుగు చిత్రంతో వచ్చింది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!)

ప్రస్తుతం హిందీ, తెలుగు తదితర భాషల్లో నటిస్తూ మృణాల్ బిజీగా ఉంది. కాగా తెలుగులో నాని 'హాయ్‌ నాన్న' మూవీలో నటిస్తున్న ఈ బ్యూటీకి ఇప్పుడు కోలీవుడ్‌ నుంచి కాలింగ్‌ వచ్చింది. స్టార్ డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ కొత్త సినిమాలో శివ కార్తికేయన్‌ హీరోగా నటించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా మృణాల్‌‌ని ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అనిరుధ్‌ సంగీతం అందించబోతున్నాడు. 

శివకార్తికేయన్‌ 'మావీరన్‌' ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ హీరో.. కమలహాసన్‌ నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. ఇది పూర్తయిన తర్వాత శివకార్తికేయన్‌, మురుగదాస్‌ కాంబోలో చిత్రం మొదలు కానుంది. రజనీకాంత్‌తో చేసిన 'దర్బార్‌' ఫ్లాప్ దెబ్బతో మురుగదాస్‌ మరో మూవీ చేయలేదు. చాలా గ్యాప్‌ తర్వాత ఇప్పుడు శివకార్తికేయన్‌‌తో చేస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో సెట్స్‌పైకి వెళ్లబోతన్న చిత్ర ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తారు. 

(ఇదీ చదవండి: వరుస రీమేక్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement