టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పెళ్లికి రెడీ? నిజమేంటి? | Actress Megha Akash Wedding Rumours Latest | Sakshi
Sakshi News home page

Megha Akash: మరో హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతోందా?

Apr 26 2024 8:42 AM | Updated on Apr 26 2024 8:42 AM

Actress Megha Akash Wedding Rumours Latest

మరో తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ అయిందా? చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఏకంగా వెడ్డింగ్ వైబ్స్ అని కొన్ని ఫొటోలు పోస్ట్ చేయడంతోనే ఈ చర్చంతా తెరపైకి వచ్చింది. గతంలో ఈమె పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. ఇంతకీ ఇందులో నిజమెంత? పెళ్లి గురించి వస్తున్న వార్తల సంగతేంటి అనేది ఓసారి చూద్దాం.

తమిళ బ్యూటీ మేఘా ఆకాశ్.. 'లై' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. గతేడాది ఓ మూడు చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఈమె పెళ్లి గురించి వార్తలొచ్చాయి. తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడు కొడుకుని పెళ్లి చేసుకోనుందని మాట్లాడుకున్నారు. ఎవరూ స్పందిచకపోవడంతో దీని గురించి అందరూ మర్చిపోయారు.

తాజాగా మరోసారి కొత్త పెళ్లి కూతురు లుక్‌లో మేఘా ఆకాశ్ దర్శనమిచ్చింది. వెడ్డింగ్ వైబ్స్ అనే హ్యాష్ ట్యాగ్‌తో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. దీంతో మరోసారి ఈమె మ్యారేజ్ హాట్ టాపిక్ అయిపోయింది. త్వరలో చేసుకోనుందని అన్నారు. మేఘా పెళ్లి న్యూస్ నిజమే అయినప్పటికీ.. మరికొన్ని రోజుల తర్వాతే అది ఉండొచ్చని తెలుస్తోంది. లేటెస్ట్ పిక్స్ మాత్రం యాడ్ షూట్‌కి సంబంధించినవి అని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement