Khushbu Sundar Tests Positive for COVID-19 - Sakshi
Sakshi News home page

Khushbu Sundar: ఒంటరిగా ఉండటం నచ్చడం లేదు.. షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన నటి

Jan 10 2022 6:19 PM | Updated on Jan 10 2022 8:05 PM

Actress Khushbu Sundar Tested Coronavirus Positive - Sakshi

సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖలు, అగ్ర హీరోహీరోయిన్లు వరసగా వైరస్‌ బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరో మహేశ్‌ బాబు, లక్ష్మి మంచు, మనోజ్‌ మంచులు కరోనా పాజిటివ్‌గా రాగా రీసెంట్‌ సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ సైతం ఈ మహమ్మారి బారినా పడ్డాడు. అలాగే ఇటీవల అమెరికా వెళ్లోచ్చిన తమిళ స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ ఇటీవల కరోనా రాగా.. ఈ రోజు సీనియర్‌ నటి శోభన కూడా కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ప్రకటించింది. తాజాగా మరో సీనియర్‌ నటికి కూడా కరోనా సోకింది.

చదవండి: మరో వివాదంలో హీరో సిద్ధార్థ్‌, మహిళా కమిషన్‌ ఎంట్రీ

ప్రముఖ నటి, తమిళ బీజేపీ నాయకురాలు ఖుష్బూ సందర్‌ కరోనా పాజిటివ్‌ పరీక్షించినట్లు సోషల్‌ మీడియా వేదిక వెల్లడించింది. ‘మొత్తానికి కరోనా వచ్చేసింది. గత రెండు వేవ్‌ల నుంచి తప్పించుకున్నప్పటికీ ఈసారి కోవిడ్‌ నన్ను చేరుకుంది. నిన్న సాయంత్రం వరకు ఎలాంటి లక్షణాలు లేని నాకు ఆ తర్వాత ముక్కు కారడం ప్రారంభమైంది. అది ఎక్కువ కావడంతో టెస్ట్‌ చేయించుకున్న నాకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న.. ఒంటరిగా ఉండటం చాలా కష్టం ఉంది. కానీ తప్పదు. కాబట్టి రాబోయే 5 రోజులు నన్ను ఎంటర్‌టైన్‌ చేయండి. అలాగే ఎలాంటి లక్షణాలు ఉన్న పరీక్షించుకోండి’ అంటూ ఖుష్బూ ఫన్నీగా ట్వీట్‌ చేసింది.  

చదవండి: మంత్రి పేర్ని నానితో భేటీ సంతృప్తినిచ్చింది: ఆర్జీవీ

Advertisement
 
Advertisement
Advertisement