షాక్‌లో నటి కయాదు లోహర్‌.. అ‍య్యో పాపం అంటూ నెటిజన్లు | Actress Kayadu Lohar Loss Big Projects In Her Career, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

షాక్‌లో నటి కయాదు లోహర్‌.. అ‍య్యో పాపం అంటూ నెటిజన్లు

Jul 15 2025 9:12 AM | Updated on Jul 15 2025 10:17 AM

Actress Kayadu Lohar Big Projects Loss Her Career

కోలీవుడ్సినిమా 'డ్రాగన్‌'లో ప్రదీప్‌ రంగనాథన్‌కు జంటగా నటి అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్‌ నటించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. అయితే అందులో నటించిన ఇద్దరు హీరోయిన్లలో నటి కయాదు లోహర్‌ ( Kayadu Lohar)కు అనూహ్యంగా క్రేజ్‌ వచ్చింది. దీంతో తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు వరుస కట్టాయి. ముఖ్యంగా డ్రాగన్‌ చిత్రానికి ముందే అధర్వకు జంటగా ఇదయం మురళి అనే చిత్రంలో నటించడానికి కమిట్‌ అయ్యారు. ఆ తరువాత జీవీ ప్రకాశ్‌కు జంటగా ఒక చిత్రం, నటుడు శింబు సరసన పార్కింగ్‌ చిత్రం ఫేమ్‌ రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ దర్శకత్వంలో ఒక చిత్రం, ధనుష్కు జతగా విఘ్నేశ్‌ రాజా దర్శకత్వంలో మరో చిత్రంలో నటించే అవకాశాలు తలుపు తట్టాయి. దీంతో నటి కయాదు లోహర్‌ పంట పండింది. ఆమె క్రేజ్‌ మామూలుగా లేదంటూ ప్రచారం జరిగింది.

అయితే స్టార్‌ హీరోలు శింబు, ధనుష్‌ చిత్రాల్లో నటించే అవకాశాలు చేజారిపోయాయి. ఇప్పుడు ధనుష్‌కు జంటగా నటించే అవకాశాన్ని నటి మమితా బైజూ తన్నుకుపోయారు. ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. అదే విధంగా శింబు సరసన నటించే అవకాశం కోల్పోయినట్లు తాజా సమాచారం. కయాదు లోహర్‌ ఎంత వేగంగా దూసుకొచ్చారో అంత వేగంగా వెనక్కు తగ్గారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.  అనుకున్నవన్నీ జరగవని అంటూనే తనకు మంచి భవిష్యత్‌ ఉందంటూ పేర్కొంటున్నారు. 

ప్రస్తుతం తమిళంలో అధర్వకు జంటగా నటిస్తున్న ఇదయం మురళి, మలయాళంలో టోవినో థామస్‌కు జంటగా నటిస్తున్న చిత్రం మాత్రమే కయాదు లోహర్‌ చేతిలో ఉన్నాయి. ఇది ఆమె కెరీర్‌కు పెద్ద షాకే అంటున్నారు సినీ వర్గాలు. అయితే, సరైన టీమ్తనవద్ద లేకపోవడమే ఇలా వచ్చిన ఛాన్స్లు కోల్పోవాల్సి వచ్చిందని మరికొందరు అంటున్నారు. మొత్తానికి అయ్యో పాపం అంటూ కయాదు లోహర్‌ఫై నెటిజన్లు సింపతీ చూపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement