Actress Jyothy Reveals About Pawan Kalyan's Flirting, Pawan Kalyan Used To Write Poems On Her - Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ నాపై ఏకంగా క‌విత్వం రాశారు: నటి

Apr 26 2021 5:52 PM | Updated on Apr 26 2021 7:59 PM

Actress Jyothi Said About Pawan Kalyan On Shooting Sets - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు మొదటి సీజన్‌ కంటెస్టెంట్‌, నటి జ్యోతి పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె.. షూటింగ్‌ సెట్స్‌లో అందరూ తన వెనకాలే పడేవారని, రకరకాల ప్రయత్నాలు చేస్తూ తనకు ట్రై చేసేవారని పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె పవన్‌ గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చింది.

‘అందరూ షూటింగ్‌ సెట్‌లో పవన్‌ కల్యాణ్‌ ఎవరితో మాట్లాడరని, ఆయన పని ఆయన చేసుకుంటారని చెబుతుంటారు. కానీ షూటింగ్‌ సెట్స్‌లో ఆయన నాతో చాలా సరదాగా ఉండేవారు. విరామ సమయంలో నాతో ఎక్కువగా మాట్లాడేవారు. అంతేకాదు ఆయన నాపై ఓ కవిత్వం కూడా రాశారు’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా పవన్‌తో జ్యోతి గుడుంబా శంకర్‌ మూవీ నటించిన సంగతి తెలిసిందే. 

హంగామా, ఎవడి గోల వాడిది, మహాత్మ, పెళ్లాం ఊరెళితే వంటి సినిమాల్లో నటించిన జ్యోతికి ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో ఆమె పాల్గోనే అవకాశం వచ్చింది. దీంతో బిగ్‌బాస్‌ హౌజ్‌ అడుగు పెట్టిన ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. ఇక అప్పటి నుంచి జ్యోతి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటు అప్పడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

చదవండి: 
నాకో ప్రియుడు‌ కావాలి, డేటింగ్‌కు వెళ్తా: జ్యోతి
హాట్‌ టాపిక్‌గా మారిన పవన్‌ కల్యాణ్ రెమ్యూనరేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement