Jyothi Bigg Boss 3 Telugu Contestant Shocking Comments On Dating: నాకో ప్రియుడు‌ కావాలి, డేటింగ్‌కు వెళ్తా - Sakshi
Sakshi News home page

నాకో ప్రియుడు‌ కావాలి, డేటింగ్‌కు వెళ్తా: జ్యోతి

Apr 26 2021 8:14 AM | Updated on Apr 26 2021 1:15 PM

Bigg Boss Fame Jyothi Sensational Comments About Dating - Sakshi

గతంలో డేటింగ్‌కు వెళ్లలేదు, కానీ ఇప్పుడు వెళ్లాలనిపిస్తోంది.. కానీ ఎవరు పడితే వాళ్లను ప్రియుడిగా యాక్సెప్ట్‌ చేయను..

ఎవరైనా మంచి కుర్రాడు ఉంటే చెప్పండని, తాను డేటింగ్‌కు రెడీగా ఉన్నానంటూ ప్రకటించి సంచలనంగా మారింది నటి జ్యోతి. హంగామా, ఎవడి గోల వాడిది, మహాత్మ, పెళ్లాం ఊరెళితే వంటి పలు సినిమాల్లో నటించిన జ్యోతి ప్రస్తుతం అటు వెండితెరకు, ఇటు బుల్లితెరకు దూరంగా ఉంటోంది. జూనియర్‌ హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లోనూ పాల్గొన్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

మీరు గతంలో ఎవరితోనో డేటింగ్‌ చేశారట కదా అని యాంకర్‌ ప్రశ్నించగా ఆశ్చర్యపోయిన జ్యోతి ఎవరితో చేశానో మీరే చెప్పండి అంటూ కౌంటర్‌ వేసింది. అసలు తాను ఇప్పటిదాకా డేటింగ్‌కే వెళ్లలేదని కుండ బద్ధలు కొట్టేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకో డేటింగ్‌కు వెళ్లాలని అనిపిస్తోందని చెప్పుకొచ్చింది. తనకు ఒక బాయ్‌ఫ్రెండ్‌ కావాలని మనసులో మాటను బయటపెట్టింది. అలా అని ఎవరు పడితే వాళ్లను ప్రియుడిగా అంగీకరించను అని తేల్చి చెప్పింది.

జీవితంలో విజయం సాధించినవాళ్లు, తెలివైనవాళ్లు మాత్రమే తనతో డేటింగ్‌కు రావాలని పిలుపునిచ్చింది. అంతే కాదు, అలాంటివాళ్లు ఎవరైనా ఉంటే రిఫర్‌ చేయండి అని యాంకర్‌కు సలహా ఇచ్చింది. ఇదంతా సరదాగా అందో? సీరియస్‌గా అందో? తెలియదు కానీ ఈ వ్యాఖ్యలు మాత్రం హాట్‌ టాపిక్‌గా మారాయి. గతంలో ప్రేమపెళ్లి చేసుకున్న జ్యోతి పలు కారణాల వల్ల అతడితో విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో పెళ్లితో ఇబ్బందులు తప్పవు అని, కాబట్టి మరోసారి పెళ్లి పీటలెక్కేదే లేదని స్పష్టం చేసింది. కానీ డేటింగ్‌కు మాత్రం వెళ్లాలని ఉందంటోంది. 

చదవండి: క‌రోనా సోకింది, క్వారంటైన్‌లో ఉన్నా: ‌పూజా హెగ్డే

ఆరు నిమిషాల సన్నివేశాన్ని సింగిల్‌ టేక్‌లో నటించిన శింబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement