Puja Hegde Tested Covid Positive | Radheshyam Movie Heroine Puja Hegde Tested Covid Positive - Sakshi
Sakshi News home page

క‌రోనా సోకింది, క్వారంటైన్‌లో ఉన్నా: ‌పూజా హెగ్డే

Apr 25 2021 9:23 PM | Updated on Sep 20 2021 11:49 AM

Pooja Hegde Tests Coronavirus Positive - Sakshi

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే క‌రోనా బారిన ప‌డింది. ఈ విష‌యాన్ని ఆమె ఆదివారం నాడు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. కోవిడ్ బారిన ప‌డిన త‌ను నిబంధ‌న‌ల ప్ర‌కారం స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని తెలిపింది. ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటున్నాన‌ని వెల్ల‌డించింది. త‌న‌ను క‌లిసిన‌వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలని సూచించింది. ఎల్ల‌ప్పుడూ త‌న వెంటే ఉంటూ ప్రేమాభిమానాలు కురిపిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపింది. 

కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న‌ను ఫాలో చేస్తున్న‌వారి సంఖ్య‌ కోటీ 30 ల‌క్ష‌లు దాట‌డంతో ఫ్యాన్స్‌కు చెప్పింది పూజా. అంద‌రీక హ‌గ్గులు, ముద్దులు అంటూ పోస్ట్ పెట్టింది. కానీ అంత‌లోనే కోవిడ్ సోకిందంటూ బాధాక‌ర‌మైన వార్త‌ను షేర్ చేసింది. ఇదిలా వుంటే పూజా హెగ్డే ప్ర‌భాస్ రాధేశ్యామ్‌, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, చిరంజీవి ఆచార్య చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే త‌మిళ ద‌ళ‌ప‌తి విజ‌య్ 65వ సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. ఇక హిందీలో ర‌ణ్‌వీర్ సింగ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న స‌ర్క‌స్‌లోనూ త‌ళుక్కున మెర‌వ‌నుంది‌.

చదవండి: బుట్టబొమ్మ ఇంట్లో బర్త్‌డే వేడుకలు

Advertisement
 
Advertisement
Advertisement