
నటి బిందు మాధవి. ఈ పేరు పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇంతకు ముందు పలు భాషల్లో, చిత్రాల్లో కథానాయికిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పదహారు అణాల తెలుగు అమ్మాయి. తెలుగు బిగ్‌బాస్ విన్నర్ అయిన బిందు మాధవి.. తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేశారు. కళగు, కేడీ బిల్లా కిలాడి రంగా, తమిళుక్కు ఎన్ ఒండ్రు అళిక్కవుమ్ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు. అలా 2019 వరకు వరుసగా చిత్రాలు చేసిన బిందు మాధవి ఆ తరువాత కారణాలు ఏమైనా వెండి తెరపై కనిపించలేదు. అలాంటిది మళ్లీ 2024లో మాయన్ చిత్రంతో ఒక రకంగా రీ ఎంట్రీ అయ్యారనే చెప్పవచ్చు.

ప్రస్తుతం బ్లాక్ మెయిల్, యారుక్కుమ్ అంజాల్ పగైవనుక్కు అరుళ్వై మొదలగు మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. అందులో ఒకటి బ్లాక్ మెయిల్. జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ఎం.మారన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు ఒకటవ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బ్లాక్ మెయిల్ చిత్రంలో నటించిన అనుభవం గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ప్రతి కళాకారుడు కళాకారుని తమ జీవితాల్లో ఒక మార్పు తీసుకువచ్చే తరుణం కోసం ఎదురుచూస్తూనే ఉంటారన్నారు అదేవిధంగా మహిళలు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందడం కోసం సవాళతలను ఎదుర్కొంటారన్నారు.
అలా దర్శకుడు ఎం మారన్ బ్లాక్మెయిల్ కథను చెప్పగానే అది తనకు బాగా కనెక్ట్ అయిన భావన కలిగిందన్నారు. అది తన కోసమే ఎదురుచూస్తున్న పాత్రగా భావించానన్నారు. దర్శకుడు రాసిన బలమైన , భావోద్వేగాలతో కూడిన ఆ పాత్ర తనలో బాధ్యతను పెంచిందన్నారు. ముఖ్యంగా పలు కథాపాత్రలతో కలిసి తన పాత్ర ఉంటుందన్నారు. జీవీ ప్రకాష్ లాంటి అద్భుతమైన నటనను ప్రదర్శించే నటుడుతో కలిసి పనిచేయటం మంచి అనుభవంగా పేర్కొన్నారు. నటి తేజు అశ్విని ,శ్రీకాంత్ తదితర నటీనటులందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారన్నారు భావోద్రేకాలతో కూడిన ఉత్సాహబహితమైన థ్రిల్లర్ కథాచిత్రంగా ఉంటుందని నటి బిందు మాధవి పేర్కొన్నారు.