కంగువ షూటింగ్‌లో హీరో సూర్యకు ప్రమాదం.. | Actor Surya Gets Injured In The Sets Of Kanguva Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Actor Suriya Injury: కంగువ షూటింగ్‌లో హీరో సూర్యకు ప్రమాదం..

Published Thu, Nov 23 2023 1:19 PM

Actor Surya Injured In Kanguva Movie Set - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ప్రమాదం జరిగింది. కంగువ చిత్రం షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సూర్య 42 వ ప్రాజెక్ట్‌గా వస్తున్న కంగువ చిత్రం షూటింగ్‌ ఫైనల్‌ షెడ్యూల్‌ జరుగుతుంది. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే థాయ్‌లాండ్‌లో షూటింగ్‌ ముగించుకుని వచ్చిన కంగువ టీమ్‌.. తాజాగా ఫైనల్ షెడ్యూల్‌ చిత్రీకరణనను చెన్నైలో ప్లాన్‌ చేశారు. 

కంగువ చిత్రం కోసం భారీ యాక్షన్‌ సీన్స్‌లో పాల్గొన్న సూర్యపై రోప్‌ కెమెరా వచ్చి పడంది. దీంతో ఆయన భుజానికి గాయమైంది. వెంటనే షూటింగ్‌ ఆపేసిన యూనిట్‌ సభ్యులు.. సూర్యను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

అదృష్టవశాత్తూ ఆ కెమెరా సూర్య భుజానికి తగలడంతో భారీ ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారని తెలుస్తోంది. లేదంటే ఆ కెమెరా భుజానికి బదులుగా సూర్య తలపై పడింటే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేదని అక్కడి వారు చెబుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూర్య ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన ఇంకా రాలేదు. కనీసం కంగువ చిత్ర యూనిట్‌ కూడా ఇప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.  దీంతో ఆయన ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. సూర్య త్వరగా కోలుకోవాలని వారు దేవుడిని ప్రార్థిస్తున్నారు.

Advertisement
 
Advertisement