Srikanth-Uha: అరుణాచలేశ్వరుని సేవలో శ్రీకాంత్ దంపతులు

సాక్షి, తిరువణ్ణామలై: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయాన్ని సినీ నటుడు శ్రీకాంత్ సతీసమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం సాయంత్రం శ్రీకాంత్, ఊహాలు అరుణాచలేశ్వరాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ జాయింట్ కమిషనర్ అశోక్‌కుమార్ ఘన స్వాగతం పలికారు. దర్శనాంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి వారి ప్రసాదాలను వారికి అందజేశారు.