
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తెలుగువారికి కూడా సుపరిచితమైన పేరు. అరుంధతి మూవీలో తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో విలన్గా మెప్పించారు. ప్రస్తుతం బాలీవుడ్లో మాత్రమే సినిమాలు చేస్తున్నారు ఈ ఏడాది ఫతే మూవీతో ప్రేక్షకులను అలరించారు.
తాజాగా సోనూ సూద్ తన ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను అమ్మేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని లోఖండ్‌వాలా మినర్వా ప్రాంతంలో ఉన్న మహాలక్ష్మీ అపార్ట్మెంట్ను దాదాపు రూ.8.10 కోట్లకు అమ్మేసినట్లు సమాచారం. కాగా.. సోనూ సూద్ 2012లో ఈ భవనాన్ని రూ. 5.16 కోట్లకు కొనుగోలు చేశాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత రూ. 2.94 కోట్ల లాభానికి అమ్మేశాడు.
ఇక సోనూ సూద్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా ఫతే చిత్రంలో కనిపించారు. ఈ చిత్రానికి సోనూనే దర్శకత్వం వహించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఊహించనంత స్థాయిలో రాణించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 13.35 కోట్లు వసూలు మాత్రమే చేసింది. ఈ మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు సోనూ సూద్. ప్రస్తుతం అతను ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయలేదు.