నటుడి ఇంట మొన్న విషాదం.. అంతలోనే సంతోషం.. | Actor Shaheen Siddique and wife Dr Amrutha Welcome Baby Girl | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటుడి ఇంట మొన్న విషాదం.. అంతలోనే సంతోషం..

Jul 29 2024 3:42 PM | Updated on Jul 29 2024 4:15 PM

Actor Shaheen Siddique and wife Dr Amrutha Welcome Baby Girl

ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిఖికి వారసుడొచ్చాడు. ఆయన కుమారుడు, నటుడు షాహీన్‌- డాక్టర్‌ అమృత దంపతులు జూలై 10న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆలస్యంగా వెల్లడించారు. మా ఇల్లు పెద్దదైపోయింది. మా కుటుంబంలోకి చిన్నారి దువా షాహీన్‌ వచ్చేసింది అని అమృత ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. కాగా షాహీన్‌, అమృత 2022 మార్చిలో పెళ్లి చేసుకున్నారు.

ఇదిలా ఉంటే సిద్ధిఖి పెద్ద కుమారుడు రషీన్‌ (37) శ్వాసకోస సమస్యలతో జూన్‌లో కన్నుమూశాడు. ఈయన బాల్యం నుంచి బుద్ధిమాంధ్యంతో బాధపడుతున్నాడు. ఇంట్లోనివారంతా ఈయన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. ముద్దుగా సప్పి అని పిలుచుకుంటారు. అమాయకంగా తిరుగుతూ కనిపించే రషీన్‌ జూన్‌ 27న కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో మరణించాడు. 

ఇతడి మరణంతో కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా షాహీన్‌ సిద్దిఖి.. పతేమరి సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాడు. శశియుమ్‌ శాంకుతలయుమ్‌, ఒరు కడతు నాదన్‌ కద, శేషం మైక్‌ ఇల్‌ ఫాతిమా, కద పరంజ కద, కసాబా వంటి పలు చిత్రాల్లో నటించాడు.

చదవండి: సీరియల్స్‌, రియాలిటీ షో వల్ల రాగద్వేషాలు.. ఇక నా వల్ల కాదు: నటి

Advertisement
 
Advertisement
Advertisement