‘1997’ అందరూ తప్పక చూడాల్సిన సినిమా: నటుడు ప్రకాష్ రాజ్

Actor Prakash Raj Comments 1997 Is Must Watch Movie - Sakshi

నటుడు నవీన్ చంద్ర, డా.మోహన్, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న భిన్నమైన కథా చిత్రం 1997. రియల్ ఇన్సిడెంట్స్‌ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన భిన్నమైన చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, మూడు ప్రధాన పాత్రల్లో నటించిన మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ లుక్స్ విడుదలైన విషయం తెలిసిందే.

ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఏమి బతుకు.. ఏమి బతుకు’కు మంచి స్పందన లభించింది. మంగ్లీ పాడిన ఈ సాంగ్ అద్భుతంగా ఉందని మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. తాజాగా ఈ సాంగ్ నీ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చూసి చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు...ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...1997..నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, డాక్టర్ మోహన్ ముఖ్య పాత్రల్లో డాక్టర్ మోహన్ డాక్టర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలోని పాట విన్నాను, కథ గురించి తెలుసుకున్నాను.

ఈ రోజుల్లో కూడా మనల్ని బాధ పెడుతున్న సమస్యల గురించి సినిమా తీశారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. నిజంగా ఇలాంటి మంచి ప్రయత్నం చేసిన మోహన్ అండ్ టీమ్ నీ అభినందిస్తున్నాను. అలాగే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాను అన్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతం అందిస్తుండటం విశేషం. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top