రెడ్డి మల్టీప్లెక్స్ మూవీస్.. క్లాప్‌ కొట్టి ప్రారంభించిన బాబు మోహన్‌ | Actor Babu Mohan Speech At Reddy Multiplex Movies Private Limited - Sakshi
Sakshi News home page

Babu Mohan: రెడ్డి మల్టీప్లెక్స్ మూవీస్.. క్లాప్‌ కొట్టి ప్రారంభించిన బాబు మోహన్‌

Apr 17 2023 9:09 PM | Updated on Apr 18 2023 11:03 AM

Actor Babu Mohan Speech At Reddy Multiplex Movies Private Limited - Sakshi

రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ ప్రై.లి. ప్రొడక్షన్ హౌస్‌ సంస్థను బాబు మోహన్ చేతుల మీదుగా ప్రారంభించారు నిర్వాహకులు. ఈ మేరకు రామానాయుడు స్టూడియోస్ ఆవరణలో మూడు సినిమాలను పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ చేశారు. ఇందులో ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కిస్తున్న సినిమా 'సోషల్ వర్కర్స్'. ప్రసాద్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో 8మంది హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

వీటితో పాటు ‘కోబలి’,‘హ్యాపీ ఉమెన్స్ డే’సినిమాలకు సంబంధించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజ అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బాబు మోహన్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఈ ప్రొడక్షన్‌ హౌస్‌లో ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 20 సినిమాలు ప్లాన్ చేశారని, త్వరలోనే వాటి అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement