Aadi Saikumar : ఇండస్ట్రీలోకి వచ్చి 12ఏళ్లు.. ఆది సాయికుమార్‌ సినీ జర్నీ

Actor Aadi Saikumar Sucessfully Completes 12 Years In TFI - Sakshi

డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన హీరో ఆది సాయికుమార్‌. ప్రేమకావాలి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆది ఇండస్ట్రీలోకి ఎంట్రీ  ఇచ్చి నేటితో పన్నెండేళ్లు పూర్తయ్యింది. ఈ పుష్కరకాలంలో ఆయన ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు. ఫలితంతో సంబంధం లేకుండా అభిమానుల్ని అలరించడానికి డిఫరెంట్‌ జానర్స్‌ను ప్రయత్నిస్తూనే వచ్చాడు.

ఆయన కెరీర్‌లో ప్రేమ కావాలి, లవ్‌లీ, సుకుమారుడు, శమంతకమణి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ, శశి ఇలా అనేక రకాల కాన్సెప్టులతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.గత ఏడాది ఏకంగా ఐదు సినిమాలతో ముందుకు వచ్చాడు. కానీ కరోనా వల్ల ఆది నటించిన సినిమాలు కాస్త ఆలస్యం అయ్యాయి. దీంతో గత ఏడాది తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో,బ్లాక్ అతిథి దేవో భవ, టాప్ గేర్ అంటూ ఇలా వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

చివరగా వచ్చిన టాప్ గేర్ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ఆది సాయి కుమార్ ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చారు. పులి మేక అనే వెబ్ సిరీస్‌లో ఆది సాయి కుమార్ నటించారు. ప్రస్తుతం ఈ పులి మేక వెబ్ సిరీస్‌ జీ5లో ట్రెండ్ అవుతోంది. ఫోరెన్సిక్ టీమ్ హెడ్ ప్రభాకర్ శర్మ పాత్రలో ఆది కనిపించిన తీరు, నటించిన సీన్ల గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఇలా ఓటీటీలోనూ నటించి ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చారు.త్వరలోనే ఆది నుంచి రాబోతున్న కొత్త ప్రాజెక్టుల వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top