ఓటీటీకి వంద కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Sakshi
Sakshi News home page

ఓటీటీకి ప్రియమణి సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Mon, Mar 18 2024 4:27 PM

The action thriller stars of Priya Mani and Yami Gautam Ott Date Fix - Sakshi

యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ఆర్టికల్ 370. జమ్మూకశ్మీర్‌లో కేంద్రం రద్దు చేసిన ఆర్టికల్ 370 ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఆదిత్య సుహాస్ జంభలే తెరకెక్కించారు. ఫిబ్రవరి 23న థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. కొత్త ఏడాదిలో వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన జాబితాలో నాలుగోస్థానంలో నిలిచింది. 
 
థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ఏప్రిల్ 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆర్టికల్‌ 370 ఓటీటీ రైట్స్‌ను జియో సినిమా దక్కించుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. ఈ చిత్రానికి ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించగా.. బీ62 స్టూడియోస్, జియో స్టూడియోస్‌పై లోకేష్ ధర్, ఆదిత్య ధర్,జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. 

Advertisement
Advertisement