Keerthi Chawla: ఆది సినిమాతో టాలీవుడ్ ఆరంగేట్రం.. ఇప్పుడెలా ఉందంటే..!

About Junior NTR Aadi Movie Heroine Keerthi Chawla - Sakshi

2002లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమా మీకు గుర్తుందా? రాయమసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నునుగు మీసాలతో చిన్నపిల్లాడిలా కనిపించాడు. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించిన హీరోయిన్ కీర్తి చావ్లా  మీకు గుర్తుందా? ఆమె ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా? తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన కీర్తి అ తర్వాత పెద్దగా సక్సెస్ కాలేదు. ఇంతకీ ఆమె ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందాం. 

ఆది సినిమాతో ఆరంగేట్రం చేసిన కీర్తి చావ్లా మన్మధుడు, కాశీ, శ్రావణమాసం, సాధ్యం, బ్రోకర్ చిత్రాల్లో కనిపించింది. కీర్తి చావ్లా  తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది.  కీర్తి చావ్లాకు సంబంధించిన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చివరి సారిగా 2016లో నమిత లీడ్ రోల్‌లో నటించిన ఇలమై ఊంజల్ అనే తమిళ్ సినిమా తర్వాత కీర్తి చావ్లా మరో సినిమాలో నటించలేదు. అయితే ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top