కిశోర్‌కుమార్‌ బయోపిక్‌లో..? | Aamir Khan in talks to star in Kishore Kumar biopic | Sakshi
Sakshi News home page

కిశోర్‌కుమార్‌ బయోపిక్‌లో..?

Oct 24 2024 3:57 AM | Updated on Oct 24 2024 4:25 AM

Aamir Khan in talks to star in Kishore Kumar biopic

ప్రముఖ దివంగత గాయకుడు– నటుడు కిశోర్‌ కుమార్‌ బయోపిక్‌ కోసం హిందీ చిత్ర పరిశ్రమలో కొంతకాలంగా సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కిశోర్‌ కుమార్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై స్పష్టత రావడం లేదు. పైగా ఎప్పటికప్పుడు పేర్లు మారుతున్నాయి. తొలుత అక్షయ్‌ కుమార్‌ పేరు వినిపించింది. ఆ తర్వాత రణ్‌బీర్‌ కపూర్‌ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆమిర్‌ ఖాన్‌ పేరు బీ టౌన్‌లో గట్టిగా వినిపిస్తోంది. కిశోర్‌ కుమార్‌ బయోపిక్‌కు అనురాగ్‌ బసు దర్శకత్వం వహిస్తారని, భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తారని ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ బయోపిక్‌ గురించి ఇటీవల ఆమిర్‌ ఖాన్‌ – అనురాగ్‌ బసుల మధ్య చర్చలు జరిగాయని, త్వరలోనే ఈ ్ర΄ాజెక్ట్‌ గురించి ఓ అధికారిక ప్రకటన వచ్చే చాన్స్‌ ఉందని భోగట్టా. మరోవైపు ‘చార్‌ దిన్‌ కీ జిందగీ, గజిని 2, ఉజ్వల్‌ నికమ్‌ బయోపిక్, ఓ సూపర్‌ హీరో ఫిల్మ్‌ (దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో) చిత్రాలు కూడా ఆమిర్‌ ఖాన్‌ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. మరి... ఆమిర్‌ ఖాన్‌ నెక్ట్స్‌ ్ర΄ాజెక్ట్‌ ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇక ఆమిర్‌ నటించిన ‘సితారే జమీన్‌ పర్‌’ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement