
పాతికేళ్ల క్రితం విడుదలైన ‘లగాన్’ సినిమా లొకేషన్స్‌కు వెళ్లారు బాలీవుడ్ నటుడు, దర్శక–నిర్మాత ఆమిర్ ఖాన్. ఆయన హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘సితారే జమీన్ పర్’. జెనీలియా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా, ఆమిర్ ఖాన్ నిర్మించారు. జూన్ 20న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్లు సాధించి, సూపర్‌హిట్‌గా నిలిచింది.
ఈ ఆగస్టు 1 నుంచి ‘ఆమిర్ ఖాన్ టాకీస్–జనతా కా థియేటర్’ యూట్యూబ్ చానల్‌లో పే పర్ వ్యూ విధానంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ సినిమాను గుజరాత్‌లోని భుజ్ నగరానికి దగ్గర్లో ఉన్న కునారియా గ్రామ ప్రజలకు ఉచితంగా ప్రదర్శించారు ఆమిర్ ఖాన్. వారితో కలిసి ప్రేక్షకుడిగా ఆమిర్ ఖాన్ ఈ సినిమాను చూసి, స్క్రీనింగ్ అనంతరం మాట్లాడారు. అలాగే అక్కడి లొకేషన్స్‌లో ‘లగాన్’ సినిమా చిత్రీకరించిన విషయాలను ఆమిర్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. అలాపాతికేళ్ల తర్వాత ‘లగాన్’ సినిమాను చిత్రీకరించిన లొకేషన్స్‌కు వెళ్లి ఆమిర్ ఖాన్ నాటి విశేషాలను అక్కడి ప్రజలతో పంచుకోవడం విశేషం.