సల్మాన్‌.. ఆమిర్‌... ఓ సినిమా! | Aamir Khan offered Champions remake to Salman Khan | Sakshi
Sakshi News home page

సల్మాన్‌.. ఆమిర్‌... ఓ సినిమా!

Feb 3 2023 1:49 AM | Updated on Feb 3 2023 1:49 AM

Aamir Khan offered Champions remake to Salman Khan - Sakshi

సల్మాన్‌ ఖాన్, ఆమిర్‌ ఖాన్‌లు కలిసి ఓ సినిమా చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. స్పానిష్‌ ఫిల్మ్‌ ‘చాంపియన్స్‌’ హిందీ రీమేక్‌ను నిర్మించి, నటించా లనుకున్నారు ఆమిర్‌. అయితే ఇప్పుడు ఈ రీమేక్‌కు సల్మాన్‌ ఖాన్‌ బాగుంటారని భావించారట.

ఈ సినిమా గురించి చర్చించడానికి సల్మాన్‌ను ఇంటికి ఆహ్వానించారట ఆమిర్‌. కాగా తాను నటించిన ‘ది ఫారెస్ట్‌ గంప్‌’ హిందీ రీమేక్‌ ‘లాల్‌సింగ్‌ చడ్డా’ సరిగ్గా ఆడకపోవడంతో వెంటనే మరో రీమేక్‌లో నటించాలనే నిర్ణయాన్ని ఆమిర్‌ మార్చుకున్నారట. అందుకే హీరోగా నటించాల్సిందిగా సల్మాన్‌ను రిక్వెస్ట్‌ చేశారని టాక్‌.

Advertisement
 
Advertisement
Advertisement