Aa Ammai Gurinchi Meeku Cheppali Movie: ఆ అమ్మాయి గురించి చెప్పాడు.. సినిమాలు పడవంటూ

Aa Ammai Gurinchi Meeku Cheppali Movie Teaser Released - Sakshi

Aa Ammai Gurinchi Meeku Cheppali Movie Teaser Released: యంగ్‌ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ చిత్రానికి భిన్న కథలతో అలరించే మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్‌ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో వస్తున్న మూడో ప్రేమకథా  చిత్రం ఈ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్‌, బెంచ్‌మార్క్‌ స్డూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్. ఆరు సంవత్సరాల్లో వరుసగా 6 సూపర్‌ హిట్‌లు అందించిన కమర్షియల్‌ ఫిల్మ్‌ మేకర్‌గా సుధీర్‌ బాబుని పరిచయం చేయడంతో టీజర్‌ ప్రారంభమవుతుంది. 6 సూపర్‌ హిట్‌లు అందించిన డైరెక్టర్‌గా కొంచెం గర్వంతో ఉన్న సుధీర్ బాబుకి అవన్ని రోటీన్ సినిమాలను అతని స్నేహితుడు ఎగతాళి చేయడం బాగుంది. 

అ‍ప్పుడే డాక్టర్‌ అలేఖ్య పాత్రలో నటిస్తున్న కృతి శెట్టిని హీరో కలుస్తాడు. ఆమె ఒక కళ్ల డాక్టర్‌. ఆమెకు సినిమాలంటే విరక్తి. అలాంటి అమ్మాయితో సినిమా చేసేందుకు ఒ‍ప్పించే ప్రయత్నంగా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. తను అమ్ముకునే సినిమాలు కాకుండా తనను నమ్ముకునే సినిమాలు చేస్తానని హీరో చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. వివేక్‌ సాగర్‌ బీజీఎం అలరించింది. ఓవరాల్‌గా చూసుకుంటే టీజర్ పర్వాలేదనిపించింది. కానీ మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌ అంటే తప్పకుండా అంచనాలు ఉంటాయి. అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిశోర్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కల్యాణి నటరాజన్‌ తదితరులు సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తామని మేకర్స్‌ తెలిపారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top