Sakshi News home page

ఆకట్టుకుంటున్న ‘1134’ ట్రైలర్‌

Published Thu, Dec 7 2023 3:09 PM

1134 Movie Trailer Out - Sakshi

ప్రస్తుతం కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న చిత్రాలకు ఆదరణ లభిస్తోంది. ఇలాంటి ఓ డిఫరెంట్ ప్రయోగమే  ‘1134’ మూవీ. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు నూతన దర్శకుడు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి. శాన్వీ మీడియా బ్యానర్ మీద రాబోతోన్న ఈ మూవీకి భరత్ కుమార్ పాలకుర్తి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగనుందని ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్‌ను చూస్తూనే అర్థం అవుతోంది. 2 నిమిషాల 28 సెకనుల నిడివితో వచ్చిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. సొంతంగా తనే కథ రాసుకొని హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్నివర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి.

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 15న విడుదల చేయబోతోన్నట్టుగా యూనిట్ తెలిపింది.రాంధుని క్రియేషన్స్, శాన్వీ మీడియా బ్యానర్‌‌లపై తెరకెక్కుతున్న ఈ 1134 చిత్రంలో కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్,నర్సింగ్ వాడేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ మురళీ కార్తికేయ సంగీతం అందిస్తున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement