టేక్మాల్(మెదక్): అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో బీమా పథకం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్‌కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు బీమా చేయించుకోవాలన్నారు. పట్టణ ప్రాంతలో ఉన్న వారు అక్కడే దగ్గరలో ఉన్న సెంటర్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఎటువంటి సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జీవిత బీమా నమోదు ప్రక్రియలో క్షేత్రస్థాయి అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీఓ సత్యనారాయణ, ఈఓ రాకేశ్ ఉన్నారు.


