ఓటరు నమోదుపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

ఓటరు నమోదుపై అవగాహన అవసరం

Nov 19 2026 1:54 PM | Updated on Nov 19 2026 1:54 PM

ఓటరు నమోదుపై అవగాహన అవసరం భూ సర్వే వేగవంతం పొగమంచుతో జాగ్రత్త: ఎస్పీ జీపీ కార్యదర్శిపై ఫిర్యాదు

మెదక్‌ కలెక్టరేట్‌: విద్యార్థులు ఓటరు నమోదుపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో విద్యార్థులకు ఓటరు నమోదు, ఓటర్ల జాబితా తయారీ, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ ప్రక్రియపై జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవగాహన పెరిగినప్పుడే ఓటింగ్‌ ప్రక్రియ సజావుగా జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్‌ గఫార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రాజేశ్వరి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

అల్లాదుర్గం(మెదక్‌): భూముల రీ సర్వే వేగవంతం చేయాలని మెదక్‌ ఆర్డీఓ రమాదేవి సూచించారు. బుధవారం అల్లాదుర్గంలో సర్వేను పరిశీలించి మాట్లాడారు. రీసర్వే పూర్తయితే వంద శాతం రైతుల ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. రైతుల సమస్యలు తీర్చేందుకే ప్రభుత్వం సర్వే చేపడుతుందన్నారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు తీరుతాయని వివరించారు. ఆమె వెంట తహసీల్దార్‌ మల్లయ్య, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.

మెదక్‌జోన్‌: గత కొన్ని రోజులుగా జిల్లాలో కురుస్తున్న పొగ మంచు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు వాహనదారులకు సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్‌ వాడాలని తెలిపారు. ట్రాఫిక్‌ నిబంధనలు, రహదారి భద్రతా సూచనలు పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, డ్రైవింగ్‌ సమయంలో మొబైల్‌ ఫోన్‌ వాడకూడదని చెప్పారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): మండలంలోని చందంపేట కార్యదర్శి పద్మపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌లో పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు బుధవారం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక అధికారుల పాలనలో నిబంధనలకు విరుద్దంగా స్థానిక ఎంఎస్‌ఎన్‌ రసాయన పరిశ్రమలో అదనంగా 12 బ్లాకుల నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో పాటు గొప్యత పాటించిన అప్పటి కార్యదర్శిపై చర్యలు తీసుకోవడంతో పాటు భవన నిర్మాణాల అనుమతులు రద్దు చేయాలని కోరారు. 11 నెలల క్రితం నూతన పంచాయతీ పాలకర్గం ఏర్పడినప్పటికీ భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఎలాంటి సమాచారం అందించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించారని వివరించారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా ఉన్న ఎంఎస్‌ఎన్‌ పరిశ్రమ అదనపు భవన నిర్మాణ అనుమతులను రద్దు చేయడంతో పాటు పరిశ్రమ విస్తరణను నిలిపివేయాలని కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో చందంపేట వార్డు సభ్యులు రామకృష్ణ, శేరి స్వామి, నర్సింహులు, నరేశ్‌, భూపాల్‌, చిన్నస్వామి ఉన్నారు.

డీసీసీ అధ్యక్షుడికి

తప్పిన ప్రమాదం

టేక్మాల్‌(మెదక్‌): సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్‌రెడ్డికి ప్రమాదం తప్పింది. బుధవారం సాయంత్రం నారాయణఖేడ్‌ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తుండగా టేక్మాల్‌ మండలం బొడ్మట్‌పల్లి 161వ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. రోడ్డు పక్కన ఎవరూ లేకపోవడంతో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement