ఆగని అఘాయిత్యాలు | - | Sakshi
Sakshi News home page

ఆగని అఘాయిత్యాలు

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

10 రోజుల్లో

మూడు పోక్సో కేసులు

పోక్సో కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్షల జరిమానా విధించినా జిల్లాలో బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. గడిచిన 10 రోజుల వ్యవధిలో మూడు పోక్సో కేసులు నమోదు కావటంతో ఆడపిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వారం క్రితం నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికల భద్రత కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారికి సంపూర్ణ రక్షణ కల్పించటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – మెదక్‌జోన్‌

జిల్లాలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగటం లేదు. పిల్లల రక్షణ కోసం 2012లో పోక్సో చట్టం వచ్చింది. 18 ఏళ్లలోపు పిల్లలపై లైంగిక దాడి, వేధింపులు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. అయితే ఎంత కఠినమైన శిక్షలు పడినా బాలికలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. బాలికల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా అవి రక్షణ కల్పించలేక పోతున్నాయి. హవేళిఘణాపూర్‌ మండలంలోని ఓ గ్రామంలో 4 ఏళ్ల చిన్నారికి చాకెట్లు ఇప్పిస్తానంటూ పక్కింట్లో ఉండే ఓ 17 ఏళ్ల బాలుడు ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యం చేయటంతో ఆ చిన్నారికి తీవ్ర రక్తస్రావం అయింది. చిన్నారి తల్లిదండ్రులు ఆ మృగాడిపై ఫిర్యాదు చేయగా పోక్సోకేసు నమోదు అయింది. అలాగే రామాయంపేట మండలంలోని ఓ గ్రామంలో ఇంటర్‌ చదువుతున్న బాలికను పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు ప్రేమపేరుతో లోబరుచుకున్నాడు. దీంతో బాధిత బాలిక గర్భం దాల్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఐదు రోజుల క్రితం మెదక్‌ పట్టణంలోని ఓ వీధికి చెందిన 9వ తరగతి చదువుతున్న ఓ బాలికను ఇంటి పక్కనే ఉంటున్న ఇంటర్‌ చదివే విద్యార్థి లైంగికంగా వేధించగా పోక్సో కేసు నమోదు చేశారు. ఇలా పది రోజుల వ్యవధిలోనే మూడు కేసులు నమోదు అయ్యాయంటే బాలికలపై లైంగిక వేధింపుల తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బాలికలకు రక్షణ కరువు!

బాలికలకు సంపూర్ణ రక్షణ ఎక్కడా కనిపించటం లేదు. చదువు కోసం బడులకు పంపితే ఉపాధ్యా యులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. మరి కొందరు ఇళ్ల పక్కనే ఉంటూ అభం శుభం ఎరుగని చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు పట్టుమని 18 ఏళ్లు కూడా దాటని బాలురు అప్పుడే ప్రేమ అంటూ బాలికలను వేధింపులకు గురి చేస్తున్నారు. ఇలా బాలికలకు ఎక్కడా రక్షణ లేకపోవటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదిలాఉండగా బాలికల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయి. షీటీం, పోక్సో, బాధిత బాలికలు, మహిళలకు భరోసా కేంద్రం ద్వారా ఉచిత న్యాయంతో పాటు అన్నిరకాల రక్షణ, పాఠశాల, కళాశాల స్థాయి నుంచి బాలికలకు ఎప్పటికప్పుడు రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా ఎస్పీ ‘పోలీస్‌ అక్కా’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలా ఎన్నోరకాల చట్టాలు అందుబాటులోకి వచ్చినా అఘాయిత్యాలు ఆగటం లేదు.

ఇటీవల నాలుగేళ్ల చిన్నారిపై దారుణ ం

జిల్లాలో వరుస ఘటనలు

ఎన్ని చట్టాలు వచ్చినా మారని తీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement