ఎల్‌ నినోపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ నినోపై అవగాహన అవసరం

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

అదనపు కలెక్టర్‌ నగేశ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: గ్రామ సభల ద్వారా జిల్లాలో ఎల్‌నినో వల్ల ఏర్పడనున్న కరువు పరిస్థితులను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టరేట్‌ నుంచి ఎంపీడీఓలతో గూగుల్‌ మీట్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఎల్‌నినో గ్రామసభలు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, జలసిరి పనులు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలసిరి పనులకు సంబంధించి కొన్ని మండలాల్లో కొత్త పనుల ప్రారంభం, గ్రౌండింగ్‌లో ఆశించిన పురోగతి కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మంజూరైన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కమ్యూనిటీ సోక్‌పిట్స్‌ నిర్మాణంలో కూడా వేగం పెంచాలన్నారు. వచ్చే వారం నాటికి నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మంజూరైన పనులన్నీ ప్రారంభించాలని ఆదేశించారు. పాఠశాలల్లో ఎల్‌నినో అంశంపై విద్యార్థులతో మాట్లాడించాలన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, డీపీఓ యాదయ్య, మిషన్‌ భగీరథ అధికారి సంపత్‌ కుమార్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement