జిల్లాకు చేరి | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు చేరి

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

ఎల్లలు దాటి..

● పత్తి తీతకు ఇతర ప్రాంతాల కూలీలు

● మూడు నెలల పాటు ఉపాధి

● రవాణా, వసతులు కల్పిస్తున్న రైతులు

అల్లాదుర్గం(మెదక్‌): పత్తి తీత వారికి ఉపాధి కల్పిస్తుంది. ఏటా వందల కిలోమీటర్ల నుంచి పిల్లాపాపలతో జిల్లాకు వలస వచ్చి కూలి పనులు చేస్తున్నారు. గత ఏడేళ్లుగా ఏపీ, కర్నాటకతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూలీలు ఉపాధి కోసం ఇక్కడికి వస్తున్నారు. గ్రామాల్లో ఆరుబయట గుడారాలు వేసుకొని వణికిస్తున్న చలిలో వంటలు చేసుకొని ఉదయమే పనులకు వెళ్తున్నారు.

జిల్లాలో ఇక్కడే పత్తి సాగు అధికం

అల్లాదుర్గం మండలంలోని చిల్వెర, మందాపూర్‌, బహిరన్‌ దిబ్బ, చెవెళ్ల గ్రామాల్లో పత్తి తీతకు నల్గొండ, మహబూబ్‌నగర్‌, కర్నాటక, ఏపీలోని కర్నూలుకు చెందిన వందలాది మంది వలస కూలీలు పనుల కోసం వచ్చారు. మండలంలో పత్తి పంటను ఆధికంగా సాగు చేయడం, పత్తి తీతకు స్థానికంగా కూలీలు దొరకకపొవడంతో ఇతర ప్రాంతాలకు చెందిన వలస కూలీలపైనే ఇక్కడి రైతులు ఆధారపడుతున్నారు. ఏటా రైతులు ముందుగానే వీరి వద్దకు వెళ్లి కూలీ పనుల కోసం మాట్లాడుకొని కొంత డబ్బు అడ్వాన్స్‌గా చెల్లించి తెప్పించుకుంటారు. వారు మూట, ముళ్లే సర్ధుకొని పిల్లాపాపలతో కలిసి చేరుకుంటారు. ఇక్కడ రైతులు గ్రామాల్లో గ్రూపులుగా ఏర్పడి ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రప్పిస్తారు. వారు ఉండటానికి వసతులు సమకూరుస్తారు. గుడారాలు ఏర్పాటు చేసుకుంటే విద్యుత్‌ సౌకర్యం, నీటి వసతి కల్పిస్తారు. రవాణ చార్జీలు సైతం రైతులే భరించాల్సి ఉంటుంది. వలస కూలీలు వచ్చిన రోజు మాంసహరంతో విందు సైతం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.

కిలోకు రూ. 10

పత్తి తీతకు వచ్చిన వలస కూలీలకు కిలో పత్తికి రూ.10 నుంచి రూ.12 చొప్పున చెల్లిస్తారు. రోజుకు 50 నుంచి 100 కిలోల వరకు పత్తి తీస్తామని కూలీలు చెబుతున్నారు. పత్తి సీజన్‌లో మూడు, నాలుగు నెలల వరకు రోజు పని దొరుకుతుందంటున్నారు. రోజుకు రూ. 500 నుంచి రూ. 700 వరకు సంపాదిస్తామని పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement