వణికిస్తున్న చలిపులి | - | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న చలిపులి

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

మెదక్‌ కలెక్టరేట్‌: చలి పులి జిల్లా ప్రజలను వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఉదయం 8 గంటల వరకూ చలి తీవ్రత తగ్గకపోవడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎండ దంచికొడుతుంది. మళ్లీ 3 గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. మారుతున్న ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో గత వారం రోజులుగా ఉదయం, సాయంత్రం వేళల్లో 14 నుంచి 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అలాగే మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రతలు 32 నుంచి 33 డిగ్రీలు నమోదవుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చలిని తట్టుకునేందుకు ప్రజలు స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు ధరిస్తున్నారు. దీంతో ఉన్ని దుస్తులకు గిరాకీ పెరిగింది. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టిన రైతులు చలిని తట్టుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఉదయం పొగమంచు ఉండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మారుతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న చలి ప్రభావంతో శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. హృద్రోగులు, చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మధ్యాహ్నం తీవ్ర ఎండ

జిల్లాలో విభిన్న

వాతావరణ పరిస్థితులు

జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement