బడుల్లో నాలుగంచెల భద్రత | - | Sakshi
Sakshi News home page

బడుల్లో నాలుగంచెల భద్రత

Nov 12 2026 11:36 AM | Updated on Nov 12 2026 11:36 AM

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు

పాపన్నపేట(మెదక్‌): ‘బడుల్లో ఇటీవల పెరుగుతున్న అఘాయిత్యాలపై ఉక్కుపాదం మోపేందుకు సర్కార్‌ సిద్ధమవుతుంది. నాలుగంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కొత్త విధానం రూపకల్పన చేస్తుంది. ఇక నుంచి పోక్సో, సైబర్‌, డ్రగ్స్‌, ట్రాఫిక్‌, విపత్తు, ప్రత్యేక పిల్లల రక్షణ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే దిశగా ‘సమగ్ర పాఠశాల భద్రతా విధానం’ అమల్లోకి తేనుంది. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో టీజీఎస్‌ 4సీ ప్రోగ్రాం మేనేజ్‌మెంట్‌ యూనిట్‌కు రూపకల్పన చేస్తుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌, గురుకులాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో కొత్త విధానంతో విద్యార్థులకు రక్షణ కల్పించే దిశగా చర్యలు చేపడుతోంది. కాగా, జిల్లాలో 1,037 పాఠశాలలు, 1,26,143 విద్యార్థులు ఉన్నారు.

సమగ్ర పాఠశాల భద్రతా విధానం

జిల్లాలో ప్రభుత్వ, రెసిడెన్షియల్‌, గురుకులాలు, ఆదర్శ, మైనార్టీ తదితర బడులతో పాటు ప్రైవేట్‌వి కలిపి 1,037 పాఠశాలలున్నాయి. అందులో 1,26,143 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలల్లో చిన్నారులపై అసభ్య ప్రవర్తన, మత్తు పదార్థాల వినియోగం, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు ‘ సమగ్ర పాఠశాల భద్రతా విధానం’ అనే ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు తెలుస్తుంది. ఇందుకోసం పీఎంశ్రీ కార్యక్రమం నుంచి నిధులు మంజూరు చేస్తారు. విద్యార్థుల భద్రతను ప్రతి రోజు పర్యవేక్షించడానికి పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో నాలుగంచెల నివేదికల వ్యవస్థ ఉంటుంది.

కౌమర క్లబ్‌లు రద్దు

ఇప్పటివరకు పాఠశాలల్లో వేర్వేరుగా ఉన్న బాలికా శిశు సాధికారత, కౌమర క్లబ్‌లను రద్దు చేసి వాటి స్థానంలో స్కూల్‌ సురక్ష క్లబ్‌లను ఏర్పాటు చేస్తారు. సాంకేతికంగా పర్యవేక్షించడానికి పోలీస్‌ శాఖ అధ్వర్యంలో ‘టీజీఎస్‌4సీ’ ప్రోగ్రాం మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ పనిచేస్తుంది. ఇందులో ప్రోగ్రాం మేనేజర్‌, చైల్డ్‌ సేఫ్టీ స్పెషలిస్ట్‌ తదితరులు కలిపి ఆరు రకాల నిపుణులు ఉంటారు. వీరిని కాంట్రాక్ట్‌ పద్ధతిన నియామకం చేయనున్నారు. పిల్లలలపై లైంగిక వేధింపులు, తీవ్రమైన భద్రతా లోపాలు, మత్తు పదార్థాల రవాణ లాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు పోలీస్‌, సంక్షేమ, శిశు సంక్షేమ కమిటీలకు తక్షణమే సమాచారం అందించేలా జీరో డిలే ప్రొటోకాల్‌ అమల్లోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

అన్ని పాఠశాలల్లో ‘సురక్ష క్లబ్‌’లు

పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ‘టీజీఎస్‌ 4సీ’

జిల్లాలో 1,037 స్కూల్స్‌.. 1,26,143 విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement