సందడిగా సదర్‌ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

సందడిగా సదర్‌ సమ్మేళనం

Nov 12 2026 11:36 AM | Updated on Nov 12 2026 11:36 AM

పెద్దశంకరంపేట(మెదక్‌): మండల పరిధిలోని రామోజిపల్లిలో యాదవులు సదర్‌ వేడుకలను మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా దున్నపోతుల విన్యాసాలతో పాటు సాంప్రదాయ ఆటపాటలు, యువకుల నృత్యాలతో గ్రామంలో సందడి నెలకొంది. దున్నపోతులను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. సదర్‌ వేడుకలను వీక్షించేందుకు వివిధ గ్రామాల నుంచి యాదవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జయశీల, మాజీ ఎంపీపీ రాజు, యాదవ సంఘం అధ్యక్షుడు హెచ్‌. రాజు, ఎల్లయ్య, నాయకులు అశోక్‌, రాంచందర్‌, అనంతరావు, ఉపసర్పంచ్‌ సంగమేశ్వర్‌, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement