ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
హవేళిఘణాపూర్(మెదక్): అగ్రిగోల్డ్ బాధితులు ఈ నెల 16న జిల్లా ఎస్పీ కార్యాలయంలో తమ వివరాలను సీఐడీ అధికారులకు అందజేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్న నేపథ్యంలో అగ్రిగోల్డ్ బాండ్లు కలిగి ఉండి బాధితులుగా ఉన్న వారు నిర్ణీత గడువులోగా రసీదులు, ఇతర వివరాలు అందజేయాలని సూచించారు.
పాపన్నపేట(మెదక్): తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల్లో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని బుధవారం ఆకాశ దీపోత్సవం నిర్వ హించారు. అర్చకులు ఆలయ మంఠపంలో బంతి పూలతో అలంకరణ చేసి, చుట్టూ దీపాలు వెలిగించి పూజలు చేశారు.
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకతను పెంపొందించడానికి సమాచార హ క్కుచట్టం కీలకమని డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టంపై జిల్లాస్థాయి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌టీఐ దరఖాస్తు చేసుకున్న వారికి 30 రోజుల్లో సమాచారం అందించాలన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి చట్టం కీలకమన్నారు. కార్యక్రమంలో పౌరులకు చట్టం విధానాలు, దరఖాస్తు ప్రక్రియ, సమాచారం పొందే హక్కుల గురించి వివరంగా తెలిపారు. కార్యక్రమంలో పౌర సమాచార అధికారులు, సహాయ పీఐఓలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
చిలప్‌చెడ్(నర్సాపూర్): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో త్వరితగతిన డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సహకార అధికారి పద్మ సిబ్బందికి సూచించారు. బుధవారం మండల కేంద్రంతో పాటు బండపోతుగల్‌లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, రైతులతో చర్చించారు. ఈసందర్భంగా డీసీఓ మాట్లాడుతూ.. మండలంలోని పలు గ్రామాల్లో ఇంకా కొనుగోళ్లు ప్రారంభించలేదని, వెంటనే షురూ చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్, సోసైటీ సీఈఓ దత్తాత్రి, సిబ్బంది నర్సింలు, రైతులు పాల్గొన్నారు.
కౌడిపల్లి(నర్సాపూర్): మా పాఠశాల ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై పంపవద్దని మండలంలోని కొట్టాల సర్పంచ్ సుమలత, అఖిలపక్ష నాయకులతో కలిసి ఎంపీడీఓ, ఎంఈఓ కార్యాలయాల్లో బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొట్టాల ప్రాథమిక పాఠశాలలో 59 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నా రని తెలిపారు. ఇందులో ఒక ఉపాధ్యాయుడిని ఎంఈఓ వేరే పాఠశాలకు డిప్యుటేషన్‌పై పంపించారన్నారు. ఎంఈఓ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు గౌరిరెడ్డి, ఆంజనేయు లు, లింగం, విష్ణు, రమేష్, ఎల్లం, రాములు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. ఈ విషయమై ఎంఈఓ బాలరాజు మాట్లాడుతూ.. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వర్క్ అడ్జెస్ట్‌మెంట్‌లో భాగంగా ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై పంపనున్నట్లు తెలిపారు.


