‘అబుల్‌ కలాం’ జీవితం ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

‘అబుల్‌ కలాం’ జీవితం ఆదర్శం

Nov 12 2026 11:36 AM | Updated on Nov 12 2026 11:36 AM

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌కలెక్టరేట్‌: దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన జయంతిని పురస్కరించుకొని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగ అభివృద్ధికి, విద్యా సంస్కరణలకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఆశయాలు, దేశభక్తి, విద్యారంగానికి ఆయన చేసిన సేవలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విద్యకు ప్రాధాన్యతనిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో సత్కరించిందని కొనియాడారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

పకడ్బందీగా భూముల రీసర్వే

రీసర్వేలో అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాయని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేశ్‌ కుమార్‌, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు అదనపు కలెక్టర్‌ నగేశ్‌, ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. భూముల రీ సర్వేతో రైతులు, ప్రజలకు మేలు జరుగాలన్నారు. నెలాఖరులోగా జిల్లాలో తొలి విడతలో ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement