కరువుపై ముందస్తు మేలుకొలుపు | - | Sakshi
Sakshi News home page

కరువుపై ముందస్తు మేలుకొలుపు

Nov 12 2026 11:36 AM | Updated on Nov 12 2026 11:36 AM

పాపన్నపేట(మెదక్‌): ‘ముంచుకొచ్చిన ఎల్‌నినోతో కరువు కాలం తరుముకొస్తుంది.. ఇప్పటికై నా మేల్కొని ముందు జాగ్రత్తలు పాటించకుంటే ఆగమవుతాం’ అంటూ బుధవారం మండలంలోని సంతలో విద్యార్థులు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. పాపన్నపేట ఉన్నత పాఠశాలలో ఎకో క్లబ్‌ చెందిన సుమారు 50 మంది విద్యార్థులు కరువుపై అవగాహన కల్పించాలనుకున్నారు. ఈ మేరకు ర్యాలీగా తరలి సంతకు వెళ్లారు. నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వాడాలని, లేకుంటే ముప్పు తప్పదంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. కరువు వేళ వరి పంట వేయొద్దని కోరారు. ఇంట్లో, పబ్లిక్‌ కుళాయిలకు తప్పకుండా ఆన్‌ ఆఫ్‌ పరికరాలు బిగించాలని సూచించారు. ఇళ్లు కడుగకుండా, పచ్చి బట్టతో తుడువాలని విజ్ఞప్తి చేశారు. వృథా నీటిని పునర్వినియోగం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి కరపత్రాలు పంచి, ప్లకార్డులు ప్రదర్శించారు. వారి వెంట టీచర్లు అంజాగౌడ్‌, రమేశ్‌, మోహన్‌రావు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement