వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి

Nov 11 2026 9:28 AM | Updated on Nov 11 2026 9:28 AM

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులను ఆదేశించారు. వసతి గృహాలపై ఎల్‌నినో ప్రభావం అనే అంశంపై కలెక్టరేట్‌లో కలెక్టర్‌ మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన సంక్షేమ వసతి గృహాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతి గృహాల్లో నిరంతర తాగునీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి బోర్లు వేయాల్సిన అవసరం ఉన్న వసతి గృహాలకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని జాతీయ రహదారుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు, భూ యజమానులకు పరిహారం అందించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, డీఆర్‌వో అంబాదాస్‌ రాజేశ్వర్‌, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీఈఓ రాజు, ఎన్నికల అధికారి గఫార్‌తోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఓటరు గల్లంతైన వారికి మరో అవకాశం

హవేళిఘణాపూర్‌(మెదక్‌): ఓటరు జాబితాలో పేరు కోల్పోయిన వారికి దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చి న అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల ని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పేర్కొన్నారు. మెదక్‌లోని దాయరలో బీఎల్‌ఓలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఓటర్లు తమ వివరాలతో కూడిన ఎలక్టోరల్‌ ఫారా లను తిరిగి నింపి బీఎల్‌ఓలను అందజేయాలన్నారు. గైర్హాజరు, వలస మారకుండానే అదే ప్రాంతంలో ఉన్నట్లయితే గతంలో ఎలక్టోరల్‌ ఫారం సమర్పించకపోవడానికి గల కారణాలు పేర్కొంటూ నిర్దేశిత అనుబంధం–బి పూర్తి చేసి సంతకం చేసి బీఎల్‌ఓలకు స్వయంగా అందజేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement