బాగా చదివి లక్ష్యం చేరుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బాగా చదివి లక్ష్యం చేరుకోవాలి

Nov 11 2026 9:28 AM | Updated on Nov 11 2026 9:28 AM

తునికి గురుకుల పాఠశాల తనిఖీలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి

తునికి గురుకుల పాఠశాల తనిఖీలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి

కౌడిపల్లి(నర్సాపూర్‌): విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు శ్రద్ధగా చదవాలని, చదువుతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు. మండలంలోని తునికి ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల, కళాశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ తనిఖీ చేశారు. కిచెన్‌, మధ్యాహ్న భోజనం, వాటర్‌ప్లాంట్‌, పరిసరాలను పరిశీలించారు. తరగతి గదులను తనిఖీ చేసి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులకు 400 మార్కుల కన్నా తక్కువగా వస్తున్నాయని మంచి మార్కులు వచ్చేలా చూడాలన్నారు. విద్యలో వెనుకబడిన వారిని ఉపాధ్యాయులు గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తుందని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. గురుకులంలో సీసీ కెమెరాల ఏర్పాటు, మంచినీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బ్యాగ్‌, బెడ్‌షీట్స్‌, ట్రంక్‌ బ్యాగ్స్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ విక్రం, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేశ్‌గౌడ్‌, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి నర్సింగారావ్‌, పవన్‌, ఉపాధ్యాయులు, విద్యార్థు లు పాల్గొన్నారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గెస్ట్‌ ఉపాధ్యాయులు అంజిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement