అడుగంటుతున్న
ఘనపురం
● అదనపు కలెక్టర్ నగేశ్
● ప్రజావాణికి 52 వినతులు
ప్రాజెక్టులో తక్కువగా ఉన్న నీరు
కొల్చారం(నర్సాపూర్): మెతుకుసీమ జీవన వాహని.. ఏకై క మధ్య తరహా సాగు నీటి ప్రాజెక్టు ఘనపురంలో రోజురోజుకు నీటి నిల్వలు తగ్గుతున్నాయి. సింగూరు మరమ్మతుల్లో భాగంగా ఎగువ నుంచి నీరు రాకపోవడం, ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో గతేడాది ఇదే సమయంలో నిండుకుండలా పొంగిపొర్లిన ఆనకట్ట, ప్రస్తుతం ఇసుక తిన్నలు తేలి వెలవెలబోతోంది.
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను తక్షణం పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 52 అర్జీలు రాగా, అందులో భూ భారతి 17, ఇందిరమ్మ ఇళ్లు 11, పెన్షన్ 1, ఇతర సమస్యలపై 23 దరఖాస్తులు వచ్చాయి. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లా డుతూ.. ప్రజావాణి అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా మెదక్ మండలం ర్యాలమడుగుకు చెందిన బోయిని ఆంజనేయులు గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన చెక్కులపై సర్పంచ్ సంతకం చేయడం లేదని ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని ప్రజావాణిలో అధికారులను కోరారు.


