రామాయంపేట(మెదక్): చిరుత సంచారంతో మండలంలోని దంతేపల్లి గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. సోమవారం దంతేపల్లి నుంచి కామారెడ్డి వైపు కొందరు కారులో వెలుతుండగా, గ్రామ శివారులో కాకులగండి వద్ద రోడ్డుపై చిరుత కనిపించింది. దీంతో వాహన వేగం తగ్గించి లోపలి నుంచే ఫొటోలు తీసి గమనించారు. కొద్దిసేపటి తర్వాత చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు గుర్తించారు. ఈవిషయాన్ని డిప్యూటీ రేంజ్ అధికారి ఖుత్బొద్దీన్ ధ్రువీకరించారు. చిరుత సంచారంతో గ్రామ స్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నర్సాపూర్: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, వాటిని కాపాడాలని ఎంపీ రఘునందన్‌రావు జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ను కోరారు. ఈమేరకు సోమవారం నర్సాపూ ర్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందజేశారు. పట్టణానికి చెందిన పలు సర్వే నంబర్లలోని భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని వివరించారు. వాటిని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ వెంట జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, పలువురు నాయకులు ఉన్నారు. ఇదే విషయమై పలువు రు కాంగ్రెస్ నాయకులు సైతం మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అలాగే పలువురు తమ తమ సమస్యలపై మంత్రికి వినతిపత్రాలు అందజేశారు.
పెద్దశంకరంపేట(మెదక్): ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు నిజమైన దీపావళి పండుగ అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నా రు. ఆదివారం మండల పరిధిలోని రామోజిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నారని, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ విజయ, ఇన్‌చార్జి ఎంపీడీఓ షాకీర్‌అలీ, నాయకులు నారాగౌడ్, మధు, మురళిపంతులు, మాజీ ఎంపీపీ రాజు, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్, సర్పంచ్‌లు జయశీల, సాయిలు, రవీందర్, వెంకట్రావు, జైపాల్‌గౌడ్, విఠల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పాపన్నపేట(మెదక్): ‘వీబీజీరామ్‌జీ’ జాబ్ కార్డుల్లో గల్లంతైన కూలీల పేర్ల నమోదులో నిర్లక్ష్యం వహించినందుకు గాను మండలంలోని డాక్యా తండా పంచాయతీ కార్యదర్శి ఇశ్రత్ బేగం సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈమేరకు పంచాయతీరాజ్ కార్యదర్శి దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. తండాకు అనుసంధానంగా ఉన్న రాజ్యా, దంజ్యా, పోంలా తండాలకు చెందిన 790 మంది గిరిజనుల పేర్లను జాబ్ కార్డుల నుంచి 2022లో తొలగించారు. అయితే అప్పటి నుంచి వీరికి ఉపాధి పనుల్లో పని చేసేందుకు అవకాశం లభించడం లేదు. తిరిగి వారి పేర్లు నమోదు చేయాలని పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, అధికారులు నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలున్నాయి. ఈవిషయమై డాక్యా తండా సర్పంచ్ స్వప్న ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో స్పందించిన కమిషనర్ మొదట ఎంపీడీఓ విష్ణువర్ధన్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం మెదక్ డీఆర్‌డీఓ, డీఆర్‌డీఏ ఇచ్చిన నివేదిక మేరకు పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకున్నారు.


