జిల్లా అవసరాలకే సింగూరు నీరు | - | Sakshi
Sakshi News home page

జిల్లా అవసరాలకే సింగూరు నీరు

Nov 10 2026 8:27 AM | Updated on Nov 10 2026 8:27 AM

● జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌

● యాసంగిలో వరి పంట వద్దని రైతులకు సూచన

నర్సాపూర్‌: సింగూరు నీరు జిల్లా అవసరాలకే వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటానని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి వివేక్‌ హామీ ఇచ్చారు. సోమవారం మండలంలోని రాంచంద్రాపూర్‌లో ఎల్‌నినోపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే తుల్జరాంపేటలో పంచాయతీ భవనం ప్రారంభోత్సవంతో పాటు నర్సాపూర్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. రాజకీయాలకతీతంగా సమష్టిగా ఎల్‌నినోను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. యాసంగిలో వరి వేయొద్దని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. సింగూరు నీరు కంపెనీలకు, హైదరాబాద్‌కు తరలించవద్దన్నారు. జిల్లా ప్రజల తాగు నీటి అవసరాలకే కేటాయించాలని కోరారు. ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులకు నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ పథకం ద్వారా రైతులకు సబ్సిడీతో కూడిన రుణాలు అందజేస్తుందన్నారు. దరఖాస్తులను ఆ శాఖ అధికారులు సకాలంలో పరిష్కరించకపోవడంతో రైతులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ మాట్లాడుతూ.. ఎల్‌నినోపై ప్రజలను చైతన్య పరిచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సింగూరులో నీటి నిల్వలు తగ్గాయని, డిసెంబర్‌ 10 తర్వాత నర్సాపూర్‌, మెదక్‌, ఆందోల్‌ నియోజకవర్గాలకు తాగు నీటి సరఫరా ఆగిపోతుందని చెప్పారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో నీటి ఎద్దడిని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ఆదిత్యవర్మ, డీఏఓ దేవ్‌కుమార్‌, ఆర్డీఓ రామకృష్ణ, గృహ నిర్మాణ సంస్థ పీడీ మాణిక్యం,డీఈఈ ప్రభు, సర్పంచ్‌లు గీత, కవిత, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి రాజిరెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement