కొల్చారంలో గిరిజనుల ర్యాలీ
కొల్చారం(నర్సాపూర్): గిరిజనుల ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకమైన జాతీయస్థాయి గోర్ మేళావో–2026ను మండలంలోని వసురాం తండాలో ఈ నెల 24,25వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు గిరిజన నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మంగళవారం ర్యాలీ నిర్వహించడంతోపాటు కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను ప్రదర్శించారు. బంజారా రాష్ట్ర నాయకులు అజ్మీర రాములునాయక్, కిషన్‌నాయక్ మాట్లాడుతూ..దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి గోర్ సమాజానికి చెందిన నాయకులతోపాటు ప్రజా ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్య లో హాజరుకానున్నట్లు తెలిపారు. గోర్ సమాజ సాంప్రదాయాల పరిరక్షణ, సంస్కృతి, ఐక్యత, సామా జిక చైతన్య, విద్యా హక్కు తదితర అంశాలపై మేళాలో చర్చించనున్నట్లు తెలిపారు. గోర్ సమాజానికి చెందిన సేవాలాల్ మహారాజ్, లోకాలాల్ మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ సమాజాభివృద్ధికి కృషి చేయడమే ఈ మేళా ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో వసురాం తండా సీతా రాం తండా సర్పంచ్‌లు వినోద్‌నాయక్, మోహన్‌నాయక్, జగన్‌నాయక్, రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.


